భారత్ లో కరోనా: అమెరికా, రష్యా పెద్ద మనసు

కరోనాతో చితికిన భారత్ కు అగ్రరాజ్యాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. అమెరికా, రష్యా తక్షణంగా వైద్య పరికరాలతో విమానాలు పంపించాయి. ఇక బ్రిటన్, ఆస్ట్రేలియాలు కూడా సాయాన్ని చేస్తున్నాయి. కరోనా కల్లోలం వేళ వివిధ దేశాలు భారత్ అవసరాలను తీరుస్తూ అండగా నిలుస్తున్నాయి. కరోనా కల్లోలంతో అతలాకుతలం అవుతున్న భారత్ కు సాయం చేసేందుకు అమెరికా, రష్యా ముందుకొచ్చాయి. సాయం చేయడానికి తటపటాయించిన అమెరికాలోని జోబైడెన్ సర్కార్ ఎట్టకేలకు అక్కడి కార్పొరేట్లు, ప్రవాస భారతీయుల ఒత్తిడితో భారత్ కు […]

Written By: NARESH, Updated On : April 29, 2021 8:44 am
Follow us on

కరోనాతో చితికిన భారత్ కు అగ్రరాజ్యాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. అమెరికా, రష్యా తక్షణంగా వైద్య పరికరాలతో విమానాలు పంపించాయి. ఇక బ్రిటన్, ఆస్ట్రేలియాలు కూడా సాయాన్ని చేస్తున్నాయి. కరోనా కల్లోలం వేళ వివిధ దేశాలు భారత్ అవసరాలను తీరుస్తూ అండగా నిలుస్తున్నాయి.

కరోనా కల్లోలంతో అతలాకుతలం అవుతున్న భారత్ కు సాయం చేసేందుకు అమెరికా, రష్యా ముందుకొచ్చాయి. సాయం చేయడానికి తటపటాయించిన అమెరికాలోని జోబైడెన్ సర్కార్ ఎట్టకేలకు అక్కడి కార్పొరేట్లు, ప్రవాస భారతీయుల ఒత్తిడితో భారత్ కు భారీ సాయం చేసింది.

తాజాగా భారత్ కు వంద మిలియన్ డాలర్ల విలువైన వైద్యసామగ్రిని అమెరికా పంపించింది. వైద్యసామగ్రి సరఫరా చేస్తున్న ఫొటోలను అమెరికా రక్షణ మంత్రి ట్వీట్ చేశారు. కోవిడ్ కు సంబంధించిన అత్యవసర పరికరాలు గురువారం భారత్ కు బయలుదేరుతున్నాయి. వాటిలో వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, 15 మిలియన్ల ఎన్95 మాస్కులు, 1 మిలియన్ ర్యాపిడ్ కిట్లను అమెరికా పంపింది. అంతేకాదు.. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తయారీ సామగ్రిని భారత్ కు పంపుతున్నట్టు ప్రకటించారు. ఇది 20 మిలియన్ డోసులు తయారీకి ఉపయోగపడుతుందని తెలిపింది.

ఇక అమెరికా ఆర్థిక సాయం కూడా చేసింది. 23 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. అమెరికా తరుఫున త్వరలో వెయ్యి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేస్తామని అమెరికా వైట్ హౌస్ ప్రకటించింది.

ఇక కష్టకాలంలో రష్యా ప్రభుత్వం గొప్ప మనసు చాటుకుంది. రష్యా నుంచి వైద్య పరికరాలు, ఇతర సామగ్రి భారత్ కు చేరుకున్నాయి. రెండు విమానాల్లో సుమారు 20 టన్నుల వస్తువులను రష్యా పంపించింది. కరోనా వ్యాప్తి నివారణ, వైద్యు సదుపాయాల కల్పనకు రష్యా సహకారం అందిస్తోంది.