
థాయ్ ల్యాండ్ లోని బ్యాంకాక్ నుంచి భారత్ కు నాలుగు ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకున్నాయి. భారత వాయుసేనకు చెందిన ఎయిర్ క్రాప్ట్ ద్వారా ఇవి గుజరాత్ లోని జామ్ నగర్ కి బుధవారం సాయంత్రం చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు సింగపూర్ నుంచి రెండు సీ- 130 ఎయిర్ క్రాప్ట్ ల ద్వారా 256 ఆక్సిజన్ సిలిండర్లు పశ్చిమబెంగాల్ లోని పనాగఢకు చేరుకున్నాయి.