జంటనగరాలలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన కేసుల్లో ఎక్కువమంది నగర వాసులు కావడంతో కరోనా భయం మరింతగా పెరిగింది. రాష్ట్రం మొత్తం మీద 300 కంటే ఎక్కువ కేసులు నమోదు కాగా అందులో 150కి పైగా కేసులు జంటనగరాలలో నమోదు కావడం గమనార్హం. ముఖ్యంగా మణికొండ, రాజేంద్రనగర్, షాద్ నగర్ పరిధిలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వీరిలో 90 శాతం కేసులు మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్లోనే వెలుగు చూడటం గమనార్హం.
దీంతో ముఖ్యంగా సికింద్రాబాద్, ఎంజే రోడ్, మహేంద్రహిల్స్, సికింద్రబాద్, ఎంజే రోడ్, నాంపల్లి, యూసఫ్ గూడ, ఎమ్మెల్యే కాలనీ, న్యూమలక్ పేట, చంచల్ గూడ, నారాయణ గూడ, ఖైరతాబాద్, దారుషిఫా తదితర బస్తీల్లోని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి ఈ కరోనా వైరస్ సోకిందో..? ఏ రూపంలో ఈ మహమ్మారి విరుచుకుపడనుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొన్ని బస్తీల్లో రాకపోకల నియంత్రణకు ముళ్లకంచెలను కూడా అడ్డుగా పెడుతున్నారు.