https://oktelugu.com/

గ్రేటర్ ఎన్నికల్లో ‘కరోనా’ భయం

గ్రేటర్ ఎన్నికల వేళ ప్రజలను ‘కరోనా ’ భయం ఆవహించింది. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ మొదలు కావడంతో ఆ ఎఫెక్ట్ హైదరాబాద్ ప్రజల్లో ఆందోళన నెలకొంది. అటు ఎలక్షన్ వల్ల వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌షోలు, పార్టీ గేదర్స్, ఇంటింటి ప్రచారాలతో వైరస్ వ్యాప్తి చెందుతుందని అందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరద ప్రాంతాల్లో కోవిడ్‌తో పాటు ప్లూ, […]

Written By:
  • NARESH
  • , Updated On : November 22, 2020 / 07:49 PM IST
    Follow us on

    గ్రేటర్ ఎన్నికల వేళ ప్రజలను ‘కరోనా ’ భయం ఆవహించింది. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ మొదలు కావడంతో ఆ ఎఫెక్ట్ హైదరాబాద్ ప్రజల్లో ఆందోళన నెలకొంది. అటు ఎలక్షన్ వల్ల వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌షోలు, పార్టీ గేదర్స్, ఇంటింటి ప్రచారాలతో వైరస్ వ్యాప్తి చెందుతుందని అందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరద ప్రాంతాల్లో కోవిడ్‌తో పాటు ప్లూ, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు నిర్వహిస్తే వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

    45 శాతం మంది ప్రజలు కరోనా వైరస్‌ను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ప్రతి రోజూ నమోదైన కేసుల సంఖ్య తగ్గడంతో చాలా మంది వైరస్ తగ్గుముఖం పట్టిందనే అభిప్రాయంలో ఉన్నారు. మరోవైపు ఫెస్టివల్స్ తర్వాత కూడా కేసుల సంఖ్య తగ్గడంతో వైరస్ తీవ్రత పూర్తిగా తగ్గిపోయిందనే భ్రమలో మరి కొందరు ఉన్నారట. దీంతోనే మాస్కు, భౌతిక దూరం వంటి వ్యాప్తి నియంత్రణ ప్రాథమిక సూత్రాలను కూడా పాటించడం లేదు. మార్కెట్లు, జనసమ్మర్ధ ప్రాంతాలు, షాపింగ్ మాల్స్‌లో కూడా ఇదే వైఖరి కొనసాగుతోంది. దీంతో వైరస్ వ్యాప్తి రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఇటీవల జరిగిన బతుకమ్మ, దసరా, దీఫావళీ ఫెస్టివల్స్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నిపుణులు అంచనా వేసినంత వైరస్ వ్యాప్తి జరగలేదు. అంతేగాక కేసుల సంఖ్య కూడా అతి తక్కువగా తేలడంతో చాలా మంది వైరస్‌ను తేలిగ్గా తీసుకుంటున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

    వైరస్ వ్యాప్తికి శీతాకాలం అనువుగా ఉంటుంది. శీతల వాతావరణ పరిస్థితుల్లో టెంపరేచర్ తక్కువగా ఉండటం వల్ల వ్యాధుల వ్యాప్తి భారీగా పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో వైరస్ నియంత్రణ చర్యలను పాటించ కపోతే ఇప్పటి వరకు అదుపులో ఉన్న వైరస్ ఒక్కసారిగా విజృంభించే ప్రమాదం ఉందని తాజాగా డబ్లూహెచ్‌ఓ కూడా హెచ్చరికలు జారీ చేసింది.

    శీతాకాలంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వైద్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో వైరస్ తీవ్రత పెరగకుండా గ్రేటర్ పరిధిలో అన్ని చర్యలను చేపట్టినట్లు హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని ప్రజలకు వైరస్ నియంత్రణపై అవగాహన కల్పించడంతో పాటు పారిశుధ్య శుభ్రతను కూడా పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

    ఇంటింటికి ప్రచారం చేసే అభ్యర్థితో పాటు మరో నలుగురు వ్యక్తులు మాత్రమే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నూతన నిబంధనను పెట్టారు. అంతేగాక రోడ్ షోలలో వాహనానికి మరోక వెహికల్‌కి సుమారు 100 మీటర్ల దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. మరోవైపు వైరస్ సోకిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పిహెచ్‌సి స్థాయి నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు అన్ని రకాల చికిత్స సౌకర్యాలను అందుబాటులో ఉంచామని డిహెచ్ పేర్కొన్నారు.

    మౌళిక వసతులు, మందులు, సిబ్బంది కొరత లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. వాస్తవంగా శీతాకాలం సమయంలో సాధారణ ప్లూ, సైన్‌ప్లూతో పాటు ఇతర డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు కూడా విజృంభించే అవకాశం ఉంది.