
ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో బంగారానికి ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బంగారం రేటు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నా బంగారంపై ఇష్టం ఉండేవాళ్లు పసిడిని కొనుగోలు చేస్తూనే ఉంటారు. పండుగల సమయంలో, ఫంక్షన్ల సమయంలో మహిళలు ఎక్కువగా బంగారాన్ని ధరించడానికి ఆసక్తి చూపుతారు. బంగారం కొనుగోలు చేస్తే అత్యవసర సమయాల్లో సులభంగా అప్పు కూడా దొరుకుతుంది.
ఫైనాన్షియల్ అడ్వైజర్లు చాలామంది డబ్బులను వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారని అయితే వాటితో పోల్చితే బంగారంపై పెట్టుబడులు పెట్టడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. అయితే బంగారం కొనుగోలు చేస్తే తరుగు చార్జీలను చెల్లించాల్సి ఉండటంతో పాటు బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేస్తే దాచుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
బంగారాన్ని బ్యాంకు లాకర్ లో దాచినా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల ఎలక్ట్రానిక్ గోల్డ్ ను కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. బంగారం ఎక్స్ఛేంజ్ ఫండ్లులో సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఉంటే ఇన్వెస్ట్ చేయడం సాధ్యమయ్యేది. మ్యూచువల్ ఫండ్లలో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తామో గోల్డ్ ఫండ్లలో అదే విధంగా ఇన్వెస్ట్ చేయాలి.
గోల్డ్ ఫండ్స్ మేనేజర్లు మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బును గోల్డ్ ఫండ్ కంపెనీలలో పెడతారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ మైనింగ్ షేర్లలో సైతం ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే వీటిలో కనీసం గ్రాము బంగారం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలు కాగా 5 సంవత్సరాల తరువాత పెట్టుబడిని వెనక్కు తీసుకునే అవకాశాలు ఉంటాయి.