కరోనా వైరస్(కోవిడ్-19) ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. చైనాలో సోకినా కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. తొలుత చైనాతో తన ప్రభావం చూపిన కరోనా వైరస్ తాజాగా చైనా వెలుపలి దేశాలపై పంజా విసురుతోంది. కరోనా ఎఫెక్ట్ కు అభివృద్ధి చెందిన దేశాలే విలవిలలాడుతున్నాయి. ఇక చిన్న, చితక దేశాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా దాటికి ఇటలీ దేశం శవాల దిబ్బను తలపిస్తుంది. ఇప్పటికే ఇటలీలో 5వేలకుపైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికాపై కరోనా ప్రభావం చూపుతోంది.
అమెరికాలో గడిచిన 24గంటల్లో కరోనాతో 100మంది మృత్యువాతపడినట్లు ప్రముఖ జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ నివేదికలో వెల్లడించింది. దీంతో ప్రపంచమంతా ఒక్కసారిగా అవాక్కయింది. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికా కరోనాను నివారించడంలో విఫలమవడంతో ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే అమెరికాలో 390మంది కరోనాతో మృతిచెందినట్లు తెలుస్తోంది.
అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. అలాంటి అగ్రరాజ్యంలో నిన్న ఒక్కరోజులో 100 మంది మృత్యువాతపడటం ప్రతీఒక్కరిని కలవారినికి గురిచేస్తోంది. సోమవారం అమెరికాలో కొత్తగా 33మంది మృత్యువాత పడినట్లు ఓ ప్రముఖ వైబ్ సైట్ పేర్కొంది. దీంతో అమెరికాలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 452కు చేరింది. అగ్రరాజ్యం కరోనా దాటికి విలవిలలాడుతోంది. దీంతో అమెరికన్లు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని భయాందోళనతో కాలం వెళ్లదీస్తుంటడం శోచనీయంగా మారింది.