ఖైదీలకు మేలు చేసిన కరోనా!

కరోనా వైరస్‌ సృష్టిస్తోన్న భయానక పరిస్థితులకు ప్రపంచం మొత్తం హడలిపోతుండగా.. జైళ్లలోని ఖైదీలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యాధి కొందరు ఖైదీలకు వరంలా మారింది. ఏళ్లతరబడి జైల్లో మగ్గుతున్న వీరికి స్వేచ్ఛ దొరికినట్లయింది. జైళ్లలోని విచారణ ఖైదీలను జామీనుపై విడుదల చేయాలని అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులతో రానున్న 3-4 రోజుల్లో 3000 మంది ఖైదీలను […]

Written By: Neelambaram, Updated On : March 26, 2020 6:04 pm
Follow us on

కరోనా వైరస్‌ సృష్టిస్తోన్న భయానక పరిస్థితులకు ప్రపంచం మొత్తం హడలిపోతుండగా.. జైళ్లలోని ఖైదీలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యాధి కొందరు ఖైదీలకు వరంలా మారింది. ఏళ్లతరబడి జైల్లో మగ్గుతున్న వీరికి స్వేచ్ఛ దొరికినట్లయింది. జైళ్లలోని విచారణ ఖైదీలను జామీనుపై విడుదల చేయాలని అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే..

భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులతో రానున్న 3-4 రోజుల్లో 3000 మంది ఖైదీలను విడుదల చేయాలని తీహార్ సెంట్రల్ జైలు నిర్ణయించినట్లు తీహార్ జైలు పరిపాలన మీడియాకు తెలిపింది. అంతేకాదు చెన్నై లో కూడా మరో మూడు వేలమంది ఖైదీలు విడుదల కానున్నారు. తీహార్ జైలు రాబోయే 3-4 రోజుల్లో 3000 మంది ఖైదీలను విడుదల చేస్తుంది. వీరిలో 1500 మంది దోషులను పెరోల్‌పై, ఇతర 1500 మంది ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయనున్నారు. గత ఏడాది ఆగస్టు 5 న జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదాను రద్దు చేయడంతో అల్లర్లకు పాల్పడిన 261 మంది ఖైదీలను దేశంలోని వివిధ జైళ్లలో ఉంచారు. వీరికి కూడా తాత్కాలికం ఊరట కల్పించించారు. మరోవైపు చెన్నై సెంట్రల్‌ పుళల్‌ జైల్లో ఆడ, మగ కలుపుకుని 3 వేల మందికి పైగా ఖైదీలున్నారు. ఈ జైలులోని ఖైదీలను విడుదల చేయాలని తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు న్యాయస్థానాల నుంచి జైలు అధికారులకు ఆదేశాలు అందాయి. అయితే జైలు ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, విడుదల చేయబోయే ఖైదీల పేర్లను మాత్రం ఇంకా ఇవ్వలేదు.