రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వాళ్ళది. షూటింగ్ ఉంటేనే నాలుగు వేళ్ళు లోపలికి వెళతాయి. లేదంటే ఆ రోజు పస్తు పడుకోవాల్సిందే. రోజువారీ బేటాలే వారి సంపాదన. నెలవారీ జీతం లాంటివి ఏమీ వుండవు. ఇది నూటికి తొంబై మంది సినీ కార్మికుల దైనందిన జీవిత చక్రభ్రమణం అందులో ఎపుడైనా గతి తప్పిందా వారి భాదలు చెప్పా నలవి కాదు. షూటింగ్ ఉంటేనే కడుపు నిండుతుంది. లేదంటే ఆకలితో అలమటించాల్సిందే … రంగుల రాట్నం తిరిగినంత సేపే హుషారుగా ఉంటుంది. ఆగితే ఇక అంతే…
నలభై మూడేళ్ళుగా చిత్ర పరిశ్రమ తో అనుబంధం ఉన్న మెగాస్టార్ చిరంజీవి కి ఇవన్నీ బాగా తెలుసు. అందుకే కరోనా వైరస్ తో చిత్ర పరిశ్రమ సంక్షోభం లోకి నెట్టి వేయబడింది అని తెలుసుకోగానే స్పందించాడు.
తన వంతు వితరణ చూపించి తెలుగు సహా మొత్తం చిత్ర లోకపు కార్మికులు అందరికి ఒక కోటి రూపాయలు విరాళంగా ఇవ్వబోతున్నాడు. మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఇదే రకమైన స్పందన తో యాభై లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది. మిగతా సినీ హీరోలు కూడా సినీ కార్మికుల కోసం తమ వంతు సాయం అందిస్తున్నారు. .