బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సల్మాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్(38) హఠాన్మరణం చెందాడు. గడిచిన కొంతకాలంగా అబ్దుల్లా ఖాన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలోనే ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో అబ్దుల్లా చికిత్స పొందుతున్నాడు. సోమవారం రాత్రి పరిస్థితి విషమించడంతో అబ్దుల్లా ఖాన్ తుదిశ్వాస విడిచారు.
అబ్దుల్లా మృతి విషాయాన్ని సల్మాన్ ధృవీకరిస్తూ ‘ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం’ ట్వీటర్లో పోస్టు చేశాడు. అబ్దుల్లాతో గతంలో దిగిన ఫొటోను ట్వీటర్లో పోస్టుచేసి అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు. అబ్దుల్లా మృతివార్త తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాడీ బిల్డర్ అయిన అబ్దుల్లా, సల్మాన్‌తో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. నిత్యం వీరిద్దరు జిమ్‌కు కలిసి వెళ్లేవారు. అబ్దుల్లా మృతితో సల్మాన్ ఖాన్ కన్నీటి పర్యంతమయ్యాడు.