AP Corona Cases : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతోంది. న్నటివరకూ 10వేలకు దగ్గరగా ఉన్న రోజువారీ కేసులు ఇప్పుడు ఏకంగా 13వేలు దాటేశాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటడం కలకలం రేపుతోంది. కోవిడ్ మృతుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది.
ఏపీలో గడిచిన 24 గంటల్లోనే 13819 కోవిడ్ కేసులు నమోదుకావడం తీవ్రతకు అద్దం పడుతోంది. మరో 12 మంది కోవిడ్ తో చనిపోయారు. చిత్తూరు, తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనాతో మరణించారు. ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో చనిపోయారు. మరోవైపు నిన్న ఒక్కరోజే 5716 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు లక్ష దాటడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఏపీలో 1,01,396 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక ఏపీలోనే అత్యధికంగా విశాఖ జిల్లాలో కేసులు వెలుగుచూశాయి. ఏకంగా రోజుకు 1988 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో 1589, గుంటూరులో 1422, అనంతపురంలో 1345, నెల్లూరులో 1305 కేసులు వెలుగుచూశాయి.
ఇక ఏపీలో నిన్న 14502 కేసులు నమోదు కాగా.. ఈరోజు ఆ సంఖ్య తగ్గింది. ప్రస్తుతానికి ఏపీలో పరిస్థితి చూస్తే థర్డ్ వేవ్ తప్పేలా లేదు. మళ్లీ కేసులు పెరిగితే ఆంక్షలు పెట్టే అవకాశాలున్నాయి.
#COVIDUpdates: 25/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 22,06,060 పాజిటివ్ కేసు లకు గాను
*20,90,103 మంది డిశ్చార్జ్ కాగా
*14,561 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,01,396#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/AVGC26uidQ— ArogyaAndhra (@ArogyaAndhra) January 25, 2022