https://oktelugu.com/

Revanth Reddy:  వచ్చే ఎన్నికల్లో పోటీపై సంచలన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమర శంఖం పూరించాడు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేసేది ఎక్కడి నుంచో క్లారిటీ ఇచ్చాడు. కోస్గి లో జరిగిన కొడంగల్ నియోజక వర్గంలో డిజిటల్ మెంబెర్ షిప్ సమావేశంలో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. కొడంగల్ నియోజక వర్గంలో ఒక్కో బూతులో 500 మందిని సభ్యత్వాలు చేసిన కార్యకర్తలను సన్మానించిం రేవంత్ తన పోటీ ఎక్కడి నుంచి అనే ఊహాగానాలకు రేవంత్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 25, 2022 / 08:47 PM IST
    Follow us on

    Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమర శంఖం పూరించాడు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేసేది ఎక్కడి నుంచో క్లారిటీ ఇచ్చాడు. కోస్గి లో జరిగిన కొడంగల్ నియోజక వర్గంలో డిజిటల్ మెంబెర్ షిప్ సమావేశంలో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. కొడంగల్ నియోజక వర్గంలో ఒక్కో బూతులో 500 మందిని సభ్యత్వాలు చేసిన కార్యకర్తలను సన్మానించిం రేవంత్ తన పోటీ ఎక్కడి నుంచి అనే ఊహాగానాలకు రేవంత్ రెడ్డి తెరదించింది. తాను మళ్ళీ కొడంగల్ నుంచే పోటీ చేస్తా అని రేవంత్ తేల్చి చెప్పాడు.

    ఢిల్లీకి రాజు అయిన తల్లికి బిడ్డనే.. నేనే ఎంత ఎదిగిన కొడంగల్ బిడ్డనే అని ఎమోషన్ అయిన రేవంత్ రెడ్డి. డంగల్ లో 75 వేల సభ్యత్వాలు చేసిన నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 119 నియోజకవర్గాలకు 75 వేల సభ్యత్వాలు చేసి కొడంగల్ ఆదర్శంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ నేతలకు రాహుల్ గాంధీ తో సన్మానం చేయిస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ, లాంటి పథకాలు వచ్చాయని.. మైనార్టీలకి నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు.

    2009లో కొడంగల్ కు నేను కొత్త, అయిన కడుపులో పెట్టుకొని గెలిపించారు.. కొడంగల్ ప్రజల రుణం తీర్చుకోలేనిది… కొడంగల్ గుడి, బడి, రోడ్లు వేయించిన, 5 వేల సబ్ స్టేషన్ లు నేను తెచ్చిన.. కోస్గి బస్ డిపో, మద్దూర్ లో స్కూల్ కు న సొంత భూమి ఇచ్చిన… కొడంగల్, కోస్గి, మద్దూర్ లలో జూనియర్ కాలేజి లు, కొడంగల్ లో డిగ్రీ కాలేజ్ నేను కట్టించిన.. కొడంగల్ ప్రతి గ్రామానికి రోడ్డు, వాటర్ ట్యాంక్ లు కట్టించిన… కొడంగల్ లో తాగునీటి కోసం 350 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చిన…

    2 ఏండ్లలో కృష్ణ నీళ్లతో కొడంగల్ ప్రజల కాళ్ళు కడుగుతా అన్న పట్నం సన్యాసి ఎక్కడ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొడంగల్ లో వందల కొట్లతో రోడ్లు వేసింది నేను అని.. పోలిస్ లను అడ్డుపెట్టుకొని నన్ను ఓడించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్ ను దత్తత తీసుకున్న దరిద్రుడు కేటీఆర్ ఎక్కడ అన్నారు. ఈ మూడేళ్లలో కొడంగల్ రోడ్లపై తట్టెడు మట్టి తీయలేదన్నారు. 2018లో 5 మంది మంత్రులు కోస్గి బస్ డిపో కు శంకుస్థాపన చూసిండ్రు..ఎందుకు కట్టలేదో ఆ దరిద్రులు చెప్పాలన్నారు.

    టిఆర్ఎస్ నేతలకు ఇదే నా సవాల్.. నియోజకవర్గం అభివృడ్డి పై చర్చకు వస్తారా అని నిలదీశారు. కోస్గి లో 50 పడకల హాస్పిటల్ తీసుకొచ్చిన..నేను ఉన్నప్పుడు పని ఎక్కడ ఉందో ఇప్పుడు అక్కడే ఉందని రేవంత్ విమర్శించారు. టిఆర్ఎస్ నేతలు గుండెలపై చెయ్యివేసుకొని చెప్పాలి..నెను ఎప్పుడైనా అభివృద్ధి కి అడ్డుపడ్డనా? అని నిలదీశారు. దేవుడి మీద ప్రమాణము చేసి చెప్తున్న నేను ఎమ్మెల్యే గా ఉన్న 9 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరిపై అక్రమ కేసులు పెట్టించలేదు..

    ఈ మూడు సంవత్సరాలు నేను కావాలనే కొడంగల్ కు రాలేదు.. నేను వస్తే అభివృద్ధి ని అడ్డుకుంటున్న అంటరని రాలేదు.. సిద్దిపేట, గజ్వేల్ ఎందుకు భివృద్ది అవుతున్నాయి కొడంగల్ ఎందుకు అవ్వడం లేదని ప్రశ్నించలేదు. కొడంగల్ ప్రజలు నాటిన రేవంత్ అనే మొక్క ఈరోజు పెద్ద చెట్టుగా ఎదిగింది… మీడియా చర్చ పెట్టాలి కొడంగల్ లో నేను చేసింది ఏంటి టిఆర్ఎస్ చేసింది ఏంటి అని నిలదీశారు.

    షాదీ ముభారక్, కల్యాణ లక్ష్మీ చెక్కులు పాస్ బుక్కు లు ఇవ్వడనికి ఎమ్మెల్యే వస్తున్నాడు.. ఇదా అభివృద్ధి అంటే అని రేవంత్ రెడ్డి నిలదీశారు. హకీమ్ పెట్ గ్రామంలో ఒక యువకుడి ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు ఆంబోసిన ఆంబోతుళ్ళ దాడి చేశారని విమర్శించారు. పోలె పల్లి చిన్న ఘటన జరిగితే హత్యాయత్నం కేసులు పెట్టి వేధిస్తున్నారు.. పోలీస్ ల్లారా జాగ్రత్త ఎప్పటికి టిఆర్ఎస్ అధికారంలో ఉండదు.. మా వాళ్లను ఇబ్బంది పెడుతున్న ఒక్కొక్కడికి మితితో చెల్లిస్తానని శపథం చేశారు. ఖాకి గుడ్డలు ఉడదీయిస్తానని.. స్థానిక ఎమ్మెల్యే కు ప్రతి ఒక్కరు మామూళ్లు ఇవ్వాలి… వ్యాపారస్తులు నెల నెలా మామూళ్లు ఇవ్వలేక ఏడుస్తున్నారు… నేను ఎమ్మెల్యే గా ఉన్న కాలంలో ఎవ్వరి దగ్గరైన ఒక్క రూపాయి తీసుకున్న నా… మూడేండ్ల కాలం ఓపిగ్గా ఉన్నాం, అది చేతగాని తనం కాదు.. ఎమ్మెల్యే నేను తలుచుకుంటా ఎలా ఉంటదో మీ ముఖ్యమంత్రి ని అడుగు .. కొట్లాడుదాం అంటే సరే ఎమ్మెల్యే గిరి గియ్ వస్తా.. వేలమంది పోలీస్ లతో మీ మాంత్రులు వస్తే తరిమి కొట్టిన చరిత్ర మాది..
    బిడ్డ ఎమ్మెల్యే సద్ది కట్టుకొని షాబాద్ వచ్చి కొడుతాం…. గ్రామాల్లో చర్చ పెట్టండి రేవంత్ సర్ ఉన్నప్పుడు కొడంగల్ ఎలా ఉంది ఇప్పుడు సారా తాగే వాడు ఉంటే ఎలా ఉందో చర్చ పెట్టండి.. నేను పీసీసీ ని అది నా గొప్ప కాదు కొడంగల్ ప్రజలది గొప్పతనం అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.