గ్రామీణ ప్రాంతాల్లోనే పెరుగుతున్న కేసులు

కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. మార్చి 2020 నుంచి మొదటి వేవ్ కాగా ఫిబ్రవరి 2021 నుంచి సెకండ్ వేవ్ ప్రారంభమైంది. దీంతో కేసుల విషయంలో పలు ప్రాంతాలు భయాందోళనకు గురవుతున్నాయి. మహారాష్ర్ట, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులల కరోనా కకావికలం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్యపెరుగుతుండడంతో కరోనా మహమ్మారి విషయంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. […]

Written By: Srinivas, Updated On : May 8, 2021 6:47 pm
Follow us on

కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. మార్చి 2020 నుంచి మొదటి వేవ్ కాగా ఫిబ్రవరి 2021 నుంచి సెకండ్ వేవ్ ప్రారంభమైంది. దీంతో కేసుల విషయంలో పలు ప్రాంతాలు భయాందోళనకు గురవుతున్నాయి. మహారాష్ర్ట, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులల కరోనా కకావికలం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్యపెరుగుతుండడంతో కరోనా మహమ్మారి విషయంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

రోజుకు 4 లక్షల కేసులు
కరోనా కేసుల సంఖ్య రోజుకు 4 లక్షలు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరగడంపై శాస్ర్తవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. మూడో దశ ప్రారంభమైతే తట్టుకోలేరని చెబుతున్నారు. అయినా ప్రభుత్వాల్లో చలనం లేకుండా పోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాక్సినేషన్ వేస్తున్నా కరోనా వ్యాప్తి ఆగడం లేదు. దీంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. కరోనా నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో వ్యాక్సినేషన్ వేయించుకుందామనుకున్నా టీకా అందుబాటులో ఉండడం లేదు. ఫలితంగా కరోనా రోగుల సంఖ్య నానాటికీ రెట్టింపవుతోంది.

గ్రామీణ ప్రాంతాల్లోనే..
మెదటి వేవ్ లో పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం చూపిన కరోనా సెకండ్ వేవ్ లో గ్రామీణ ప్రాంతాల్లోనే పెరుగుతోంది. దీంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. టీకా వేసుకున్నా కరోనా నిరోధం కావడం లేదని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మనుగడ కష్టమేనని మేధావులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కరోనా నిరోధానికి కట్టడి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తేల్చారు.

పట్టించుకోని పాలకులు
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దీంతో ప్రభుత్వ తీరుపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు మేలుకుంటారని ప్రశ్నిస్తున్నారు. వేలాది మంది ప్రాణాలు పోతున్నా లెక్క లేదా అని విమర్శిస్తున్నారు. కరోనా వైరస్ ను నిర్మూలించే విధంగా పక్కాగా చర్యలు చేపట్టాల్సిన అవసరం గుర్తించాలి.