లక్షకు దిగివచ్చిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి దేశాన్ని విముక్తి చేస్తోంది. మెల్లిగా కేసులు తగ్గుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ దేశంలో కంట్రోల్ అవుతోంది. గడిచిన 24 గంటల్లో 86,498 కొత్త కేసులు వెలుగుచూశాయి. సుమారు 63 రోజుల తర్వాత కొత్త కేసులు లక్షకు దిగువకు చేరాయి. పాజిటివిటీ రేటు 4.62 శాతానికి పడిపోయింది. గత కొద్దిరోజులుగా మరణాలు కూడా దేశంలో తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గణాంకాలను వెల్లడించారు. సోమవారం 18,73,485 మందికి కొవిడ్ నిర్ధారణ […]

Written By: NARESH, Updated On : June 8, 2021 10:50 am
Follow us on

కరోనా మహమ్మారి దేశాన్ని విముక్తి చేస్తోంది. మెల్లిగా కేసులు తగ్గుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ దేశంలో కంట్రోల్ అవుతోంది. గడిచిన 24 గంటల్లో 86,498 కొత్త కేసులు వెలుగుచూశాయి. సుమారు 63 రోజుల తర్వాత కొత్త కేసులు లక్షకు దిగువకు చేరాయి. పాజిటివిటీ రేటు 4.62 శాతానికి పడిపోయింది.

గత కొద్దిరోజులుగా మరణాలు కూడా దేశంలో తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గణాంకాలను వెల్లడించారు. సోమవారం 18,73,485 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 86498 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. మొత్తం కేసులు 2.89 కోట్లకు పైబడ్డాయి. ఏప్రిల్ ప్రారంభం నుంచి నిత్యం లక్షకు పైగా నమోదైన కేసులు.. ఒక దశలో 4.50 లక్షలకూ చేరాయి.

దీంతో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. కఠిన ఆంక్షలు పెట్టాయి. దీంతో ఇప్పుడు ఆ ఫలితం కనిపించి దేశంలో కేసులు తగ్గిపోయాయి. నిన్న కేసులు లక్షకు దిగువకు చేరాయి. పాజిటివిటీ రేటు కూడా 4.62 శాతానికి చేరింది.

ఇక కొద్దిరోజులుగా మరణాల సంఖ్య కూడా తగ్గుతూనే ఉంది. తాజాగా 2123 మంది ప్ాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 3,51,309 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు వేయడం సత్ఫలితాలను ఇచ్చింది. నిన్న 33,64,476 మందికి టీకాలు ఇచ్చారు. దీంతో కేసుల సంఖ్య భారీగా తగ్గింది.

కేసులు తగ్గడంతోపాటు రికవరీ రేటు మెరుగ్గా ఉండటం కూడా ఊరటనిస్తోంది. గత 26రోజులుగా రోజూవారీ కేసులకంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయి. 24 గంటల వ్యవధిలో 1,82,282 మంది కోలుకున్నారు. మొత్తం వైరస్ ను జయించిన వారి సంఖ్య 2,73,41,462 (94.29శాతం)కు చేరింది. క్రియాశీల కేసులు 13 లక్షలకు చేరాయి. క్రియాశీల రేటు 4.50 శాతానికి తగ్గింది.