పది, ఐటీఐ పాసైన వాళ్లకు శుభవార్త.. భారీ వేతనంతో జాబ్స్..?

నేషనల్‌ లిగ్నైట్‌ అండ్‌ కోల్‌ ఇండియా లిమిటెడ్‌ భారత ప్రభుత్వ రంగ సంస్థలలో ఒక సంస్థ అనే సంగతి తెలిసిందే. ఈ సంస్థ తాజాగా 65 ఎస్‌ఎంఈ ఆపరేటర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. జూన్ 14వ తేదీ వరకు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక […]

Written By: Navya, Updated On : June 8, 2021 10:49 am
Follow us on

నేషనల్‌ లిగ్నైట్‌ అండ్‌ కోల్‌ ఇండియా లిమిటెడ్‌ భారత ప్రభుత్వ రంగ సంస్థలలో ఒక సంస్థ అనే సంగతి తెలిసిందే. ఈ సంస్థ తాజాగా 65 ఎస్‌ఎంఈ ఆపరేటర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. జూన్ 14వ తేదీ వరకు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు తమిళనాడు రాష్ట్రంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. https://www.nlcindia.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. మొత్తం 65 పోస్టులలో జనరల్ పోస్టులు 30 ఉండగా ఎస్సీలకు 12, ఓబీసీలకు 17, ఈడబ్ల్యూఎస్‌ కు 6 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ మెకానికల్‌, ఎలక్రికల్‌ ట్రేడ్‌లలో ఏదో ఒకటి ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 50 మార్కులకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఉంటుంది. ఉద్యోగాలకు సంబంధించి ఏ సందేహం ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. పది, ఐటీఐ పాసైన వాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హతకు తగిన వేతనం లభిస్తుంది.

తక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సంస్థ భావిస్తోంది.