https://oktelugu.com/

స్కూళ్లు ఓపెన్ : పిల్లలకు కేసీఆర్ భద్రతనిస్తారా?

తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేశారు. కేసులు తగ్గున్న క్రమంలో ప్రభుత్వం అన్ లాక్ ప్రకటించింది. కానీ ప్రభుత్వ పాఠశాలల ప్రారంభానికి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆందోళనకు కారణమవుతోంది. జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ లాక్ లో భాగంగా పాఠశాలలు తెరుస్తామంటే మరింత ప్రమాదం అంటున్నారు నిపుణులు. దేశంలో మూడో దశ కరోనా అత్యంత ప్రమాదకరమని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 20, 2021 7:40 pm
    Follow us on

    Coronavirusతెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేశారు. కేసులు తగ్గున్న క్రమంలో ప్రభుత్వం అన్ లాక్ ప్రకటించింది. కానీ ప్రభుత్వ పాఠశాలల ప్రారంభానికి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆందోళనకు కారణమవుతోంది. జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ లాక్ లో భాగంగా పాఠశాలలు తెరుస్తామంటే మరింత ప్రమాదం అంటున్నారు నిపుణులు.

    దేశంలో మూడో దశ కరోనా అత్యంత ప్రమాదకరమని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. మరో 6 నుంచి 8 వారాల్లో మూడో ముప్పు పొంచి ఉందని చెబుతున్నాపాఠశాలల ప్రారంభంపై కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించాలనే నిర్ణయం మంచిది కాదని చెబుతున్నారు. మూడో దశలో చిన్న పిల్లలపైనే ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నాసర్కారు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

    పాఠశాలలు ప్రారంభమైతే వారికి కనీసం టీకా కూడా ఇవ్వకపోవడంతో వారికి రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. కరోనా ప్రభావానికి పెద్దలే తట్టుకోలేకపోతుంటే చిన్నారులు ఎలా తట్టుకుంటారో పాలకులకు తెలియదా అని అడుగుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఒంటెత్తు పోకడ నిర్ణయాలతో ప్రజలను బాధ్యుల్ని చేయకూడదని పేర్కొంటున్నారు.

    పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం సాధ్యమేనా? చిన్న గదుల్లో కూర్చోబెట్టి పాఠాలు బోధించే సందర్భంలో భౌతిక దూరం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మూడో వేవ్ ప్రమాదమున్నందున పాఠశాలల ప్రారంభంపై నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని సూచిస్తున్నారు.