
ప్రధాని మోదీ ఆదివారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం నిర్వహించారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ భేటీలో పాల్గొన్నారు. కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధన్యం సంతరించుకుంది. దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ సడలింపులపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.