https://oktelugu.com/

ఏపీ అసెంబ్లీలో రచ్చ కంటిన్యూ..!

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ఐదురోజులపాటు జరిగే అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు నుంచే రణరంగాన్ని తలపిస్తున్నాయి. అధికార.. ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలతుటాలు పేలుతున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా టీడీపీ ప్రయత్నిస్తుండటంతో వైఆర్సీసీపీ నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. దీంతో సభలో వాతావరణం హిటెక్కుతోంది. Also Read: బీజేపీపై జనసైన్యం ఫైర్‌‌.. ఓట్లు పడేనా..? తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ‌.. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంల మృతికి సంతాపం తీర్మానం చేశారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 1, 2020 / 11:19 AM IST
    Follow us on

    ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ఐదురోజులపాటు జరిగే అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు నుంచే రణరంగాన్ని తలపిస్తున్నాయి. అధికార.. ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలతుటాలు పేలుతున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా టీడీపీ ప్రయత్నిస్తుండటంతో వైఆర్సీసీపీ నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. దీంతో సభలో వాతావరణం హిటెక్కుతోంది.

    Also Read: బీజేపీపై జనసైన్యం ఫైర్‌‌.. ఓట్లు పడేనా..?

    తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ‌.. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంల మృతికి సంతాపం తీర్మానం చేశారు. ఆ తర్వాత టీడీపీ నేతలు ఉపాధి హామీ బకాయిలు, ఇళ్ల పంపిణీ.. ఇసుక పాలసీ.. ఇళ్ల పట్టాల్లో అవినీతి.. పోలవరం.. స్థానిక ఎన్నికలపై చర్చించాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు.

    ఈక్రమంలోనే నిన్న టీడీపీ నేత నిమ్మల రామానాయుడు తుపాను పంట నష్టంపై మాట్లాడగా దీనికి సీఎం జగన్ సమాధానం ఇచ్చారు. కాగా దీనిపై చంద్రబాబు మాట్లాడేందుకు ప్రయత్నించగా అధికార పక్షం నేతలు తీవ్రంగా అడ్డుపడటంతో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోని ప్లోరుపై బైఠాయించిన నిరసన తెలిపాడు. దీంతో సీఎం జగన్ తనదైన శైలిలో చంద్రబాబుపై సైటర్లు వేశారు. నిన్నంతా ఏపీలో ఇదే హాట్ టాపిక్ గామారింది.

    ఇక రెండోరోజు కూడా సభలో అదే రచ్చ కంటిన్యూ అవుతోంది. హౌసింగ్ పై చర్చకు టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని తోసిపుచ్చారు. ప్రభుత్వమే దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని దీంతో దీనిని తిరస్కరిస్తున్నటు స్పీకర్ తెలిపారు. అయితే టీడీపీ నేతలు ఇప్పుడే చర్చించాలంటూ పట్టుబట్టడంతో వారిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Also Read: ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు..!

    ఆ తర్వాత పంటల ఇన్స్యూరెన్స్‌కు సంబంధించిన చర్చ జరిగింది. రైతులందరికీ డిసెంబర్ 15నుంచి ఇన్స్యూరెన్స్ డబ్బులు చెల్లిస్తామని చెబుతున్నా టీడీపీ డ్రామాలు ఆడుతుందంటూ సీఎం జగన్ మండిపడ్డారు. జగన్ ఏదైనా చెప్పారంటే చేస్తారని చంద్రబాబు నాయుడు చెప్పారంటే అసలు చేయరంటూ ఎద్దేవా చేశారు.

    అయితే సభలో చంద్రబాబుకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. పలువురు టీడీపీ నేతలు పోడియం వైపు దూసుకురావడంతో స్పీకర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే రామనాయుడిని ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. టీడీపీ-వైసీపీ నేతలు రెండోరోజు కూడా ఆరోపణలు.. ప్రత్యారోపణలకు దిగడంతో రచ్చ కంటిన్యూ అవుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్