https://oktelugu.com/

పగవాడి పథకమైనా.. సీఎం స్టాలిన్ గొప్పమనసు

తమిళనాడులో రాజకీయం రెండు పార్టీల మధ్యే ఎక్కువగా ఉంటుంది. ఒకటి డీఎంకే.. రెండు అన్నా డీఎంకే.. ప్రతీ పదేళ్లకోసారి ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావడం.. ఆ తరువాత 10 ఏళ్లకు ఓడిపోవడం సాంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలో కూర్చుంది. ఆ పార్టీ తరుపున స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తీసుకున్న మొట్టమొదటి నిర్ణయంపై […]

Written By: , Updated On : May 12, 2021 / 01:48 PM IST
Follow us on

తమిళనాడులో రాజకీయం రెండు పార్టీల మధ్యే ఎక్కువగా ఉంటుంది. ఒకటి డీఎంకే.. రెండు అన్నా డీఎంకే.. ప్రతీ పదేళ్లకోసారి ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావడం.. ఆ తరువాత 10 ఏళ్లకు ఓడిపోవడం సాంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలో కూర్చుంది. ఆ పార్టీ తరుపున స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తీసుకున్న మొట్టమొదటి నిర్ణయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ముక్యంగా ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీఎంకే కార్యకర్తలు స్టాలిన్ ను కీర్తిస్తున్నారు. ఎందుకంటే..?

అన్నాడీఎంకే పార్టీ అధినేత జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘అమ్మ క్యాంటీన్ల’ను ఏర్పాటు చేసింది. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించారు. 2013లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత 207 అమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చెన్నైలో 400కు పైగా క్యాంటీన్లు, రాష్ట్రవ్యాపత్ంగా 700కు పైగా పనిచేస్తున్నాయి. ఇవి లాక్డౌన్ సమయంలోనూ పనిచేసి పేదల ఆకలి తీర్చాయి.

ఇక ఈ క్యాంటీన్లు నష్టాల్లో ఉన్నా ప్రభుత్వం వీటిని కొనసాగిస్తోంది. 2019-20లో క్యాంటీన్ల ఆదాయం రూ.3 కోట్లు తక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో క్యాంటీన్ల నిర్వహణకు ప్రత్యేక సంస్థను ఏర్పాుటు చేశారు. ఈ క్యాంటీన్లలో ఉదయం ఇడ్లీ రూపాయికీ, పొంగల్ రూ.5 కు, మధ్యాహ్నం సాంబార్ అన్నం, పుదీన రైస్ రూ.5కు, పెరుగన్నం రూ.3కు విక్రయిస్తున్నారు. రాత్రి వేళ్లలో రూ.3కు చపాతి ఇస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు, రోజూవారీ కూలీలు వీటిని వినియోగించుకుంటున్నారు.

ఇటీవల ముఖ్యమంత్రి పీటంపై కూర్చొన్న డీఎంకే అధినేత స్టాలిన్ అమ్మ క్యాంటీన్లను యధావిధిగా కొనసాగిస్తామని సంచలన ప్రకటన చేశారు. అవి లాక్డౌన్లలోనూ కొనసాగుతాయని అనడంతో అన్నివైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇదే కాకుండా అమ్మ క్యాంటీన్లపై ఇద్దరు డీఎంకే కార్యకర్తలు దాడి చేశారు. క్యాంటిన్ సామగ్రిని చెల్లాచెదురు చేశారు. దీంతో వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. దీంతో అమ్మ క్యాంటీన్ల విషయంలో స్టాలిన్ అభిప్రాయమేంటో అందరికీ అర్థమైంది. ఇక ఇలాంటి రాజకీయ నాయకులు అందరికీ అవసరమని సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు