Mahamarg Express Highway
Maharastra : కేంద్రంలో గడిచిన పదేళ్లలో జాతీయ రహదారుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు నిర్మిస్తోంది. ఇందకు వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇక కొత్తగా నిర్మించే రహదారులపై అత్యవసర సమయంలో విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం వేల ఎకరాల భూసేకరణ కూడా చేస్తోంది. ఇక రహదారుల నిర్మాణం అటవీ ప్రాంతంలో చేపట్టే సమయంలో గతంలో వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాల పడేవి. రోడ్ల నిర్మాణం తర్వాత కూడా చాలా వన్యప్రాణులు వాహనాలు ఢీకొని మరణించాయి. కానీ, తాజాగా కేంద్రం కొత్త రహదారులు అటవీ ప్రాంతంలో నిర్మించాల్సి వస్తే.. ఫ్లై ఓవర్స్ నిర్మిస్తోంది. జంతువుల సంచారానికి ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం వందల కోట్లు ఖర్చు చేస్తోంది. తాజాగా మహారాష్ట్రలో ప్రారంభించిన జాతీయ రహదారిపై ఇలాగే ఫ్లై ఓవర్లు నిర్మించింది. సమృద్ధి మహా మార్గ్ ఎక్స్ ప్రెస్‌వే పైన జంతువులు రోడ్లు దాటేలా ఓవర్ పాస్ రోడ్డు నిర్మించింది.
మంచిర్యాల – చంద్రాపూర్ రోడ్డపై..
ఇక మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు రహదారిని విస్తరిస్తోంది. ఈ పనులతో పులులు, ఇతర వన్యప్రాణులకు ఇబ్బందలు కలుగకుండా సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. వాంకిడి–మహారాష్ట్ర సరిహద్దుతోపాటు రెబ్బెన వద్ద ఓవర్ పాస్‌లు నిర్మిస్తోంది. ఈ ఎకో బ్రిడ్లితో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఉండదు. జంతువుల సంచారానికి కూడా ఇబ్బంది కలుగదు. రహదారి పైనుంచి జంతువులు వెళ్లేలా రోడ్డు నిర్మిస్తున్నారు. అటవీ శాఖ సహకారంతో ఈ రోడ్డు, ఓవర్ పాస్‌లు నిర్మిస్తోంది.
నేషనల్ హైవే అథారిటీతో కలిపి..
కొత్త జాతీయ రహదారులన్నీ నేషనల్ హైవే అథారిటీతో కలిపి కేంద్రం నిర్మిస్తోంది. ఈ క్రమంలో జంతువుల సంరక్షణకు అధికా ప్రాధాన్యం ఇస్తోంది. మహారాష్ట్రలో జంతువులు, పులలల సంచారం ఎక్కువ. చంద్రాపూర్‌లోని తడోబా, అంథేరి పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వీటి మధ్య నుంచే రహదారులు ఉన్నాయి. వాహనాల రాకపోకలతో వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు రాశాయి. ఈ విషయమై నేషనల్ హైవే అథారిటి, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఓ నిర్ణయానికి వచ్చాయ పులుల సంరక్షణకు ఇబ్బందులు లేకుండాడ పర్యావరణ వంతెనలు నిర్మించాలని నిర్ణయించాయి.
గతంలోనూ ఎకో వంతెనలు..
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉన్న తడోబా–అంథేరి టైగర్ రిజర్వు నుంచి తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడవులను కలుపుతూ టైగర్ కారిడార్‌కు పులుల సంచారం కోసం కనెక్టివిటీ పెంచేందకు ప్రాణహిత నదిపై వంతెనలు నిర్మించారు. జిల్లా సరిహద్దులో 72 కిలోమీటర్లు నది ప్రవహిస్తుంది. దీంతో వంతెనల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. నేషనల్ వైల్డ్ లైఫ్ నుంచి అనుమతి రాలేదు. దీంతో ఎకో వంతెన నిర్మాణానికి ఓకే చెప్పింది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Construction of a bridge overpass road for wildlife on mahamarg express
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com