Rape: కూల్ డ్రింక్ లో మత్తు ఇచ్చి యువతిపై రెండేళ్లుగా కానిస్టేబుల్..

Rape: కన్నతండ్రిలా చూసుకోవాల్సిన వాడే కాటేశాడు. మేనమామ అయి ఉండి నిరంతరం రక్షణ కల్పించాల్సిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పాశవికంగా ప్రవర్తించాడు. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి తన శీలాన్ని దోచుకున్నాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ రెండేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నాడు. తాను కాకుండా తన కొడుకు కూడా ఆమెపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దీంతో ఆమె విసిగి వేసారి పోయి గంగానదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఆమె వ్యథ వర్ణణాతీతం. […]

Written By: Raghava Rao Gara, Updated On : September 14, 2021 1:11 pm
Follow us on

Rape: కన్నతండ్రిలా చూసుకోవాల్సిన వాడే కాటేశాడు. మేనమామ అయి ఉండి నిరంతరం రక్షణ కల్పించాల్సిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పాశవికంగా ప్రవర్తించాడు. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి తన శీలాన్ని దోచుకున్నాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ రెండేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నాడు. తాను కాకుండా తన కొడుకు కూడా ఆమెపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దీంతో ఆమె విసిగి వేసారి పోయి గంగానదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఆమె వ్యథ వర్ణణాతీతం.

ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలోని మీర్జాపూర్ కు చెందిన యువతిని తన మేనమామ పోషిస్తున్నాడు. 2019లో జరిగిన కుంభమేళాకి ఆహ్వానించి అప్పటి నుంచి ఆమెపై కన్ను వేశాడు. ఎలాగైనా ఆమెను అనుభవించాలని పథకం పన్నాడు. అనుకున్నదే తడవుగా ఓ సారి హోటల్ కు తీసుకెళ్లి అక్కడ కూల్ డ్రింక్ ఆఫర్ చేశాడు. అందులో మత్తు మందు కలిపి లైంగిక దాడి చేశాడు. అదే సమయంలో రహస్యంగా వీడియో కూడా తీశాడు. ఈ నేపథ్యంలో దాన్ని చూపించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు.

వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తూ అలహాబాద్, కాన్పూర్ పట్టణాల్లో పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. గర్భస్రావం కోసం మాత్ర కూడా తెచ్చి ఇచ్చాడు. ఈ క్రమంలో నిందితుడు, అతని కొడుకు ఆదివారం మళ్లీ కాన్పూర్ కు తీసుకెళ్లి లైంగికంగా వేధిస్తూ అక్కడ కూడా ఓ వీడియో తీశారు. దీంతో యువతి జీవితంపై విరక్తి చెంది తనువు చాలించాలని భావించింది. గంగానదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

వారి నుంచి తప్పించుకున్న ఆమె పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి నదిలో దూకిందని మీర్జాపూర్ డీసీపీ ప్రమోద్ కుమార్ పేర్కొన్నారు. అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు, సిబ్బంది సాయంతో ఆమెను కాపాడినట్లు చెప్పారు. యువతి ఫిర్యాదుతో ట్రాఫిక్ కానిస్టేబుల్, అతడి కుమారుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.