Kodali Nani: కొడాలి నాని ఎందుకంత సైలెంట్ అయ్యాడు? ఏం కష్టమొచ్చింది?

Kodali Nani: వైసీపీ ప్రభుత్వం లో కొడాలి నాని మంత్రిగా కొనసాగుతున్నారు. గుడివాడ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన చివరిసారిగా మంత్రి అయ్యారు. ఆయన ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వం వేరే ఉండేది. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. 2009లో మరోసారి టీడీపీ నుంచి విజయం సాధించినా కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో ఏమి చేయలేకపోయారు. దీంతో ఆయన కూడా ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పేవారు. కానీ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండడంతో తప్పించుకోవడానికి వీలు […]

Written By: Sekhar Katiki, Updated On : September 14, 2021 1:16 pm
Follow us on

Kodali Nani: వైసీపీ ప్రభుత్వం లో కొడాలి నాని మంత్రిగా కొనసాగుతున్నారు. గుడివాడ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన చివరిసారిగా మంత్రి అయ్యారు. ఆయన ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వం వేరే ఉండేది. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. 2009లో మరోసారి టీడీపీ నుంచి విజయం సాధించినా కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో ఏమి చేయలేకపోయారు. దీంతో ఆయన కూడా ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పేవారు. కానీ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండడంతో తప్పించుకోవడానికి వీలు లేకుండా పోతోంది. అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నానని తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు ఎలా తప్పించుకుంటారు.

గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ధి విషయంలో కొడాలి నాని పట్టించుకుంటారని భావించారు. కానీ వారి ఆశలు మాత్రం తీరడం లేదు. వైసీపీ జెండా ఎగరడంలో కీలక పాత్ర పోషించిన ఓటర్లు మాత్రం నిరాశగా ఉన్నారు. కొడాలి నాని తనను గెలిపించిన ఓటర్ల రుణం తీర్చుకునే పనిలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిపోతోంది. ఒక్క పని కూడా కావడం లేదు. రోడ్లన్ని అధ్వానంగా మారాయి.

కొడాలి నాని నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. జగన్ కేబినెట్ లో నోరున్న నేతగా ముద్ర పడిపోయారు. ప్రతిపక్షాలను తిట్టడంలో ఆయనదే పైచేయి. బూతు మాటలు మాట్లాడటంలో ఆయనను మించిన వారు ఎవరు లేరని తెలుస్తోంది. కానీ గుడివాడ అభివృద్ధి మాత్రం దేవుడెరుగు అనే విధంగా మారింది. విజయవాడ-గుడివాడ, గుడివాడ-హనుమాన్ జంక్షన్ రహదారుల పరిస్థితి దారుణంగా మారాయి.

గుడివాడ ప్రజలు గుర్తుంచుకునేలా ఏ ఒక్క పని కూడా చేయలేదు. దీంతో ప్రజలు నానిపై గుర్రుగానే ఉన్నట్లు తెలుస్లోంది. ఇరవై ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటున్నా పనులు మాత్రం చేయడం లేదు. బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధిస్తున్నా ఆయన తన పనితనం మాత్రం మార్చుకోవడం లేదు. ప్రజల కోసం పనులు చేయాలన్న కనీస ధర్మం కూడా చూపడం లేదు. ఎప్పుడు చూసిన చంద్రబాబును తిట్టడానికే సమయం సరిపోతుందని చెబుతున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్న పనిలో మాత్రం శ్రద్ధ కనిపించడం లేదు.