
మద్యం దుకాణాలు తెరవడంతో ఒకేసారి జనం గుంపులుగా ఎగబాకడంతో లాక్ డౌన్ ప్రయోజనాలు అన్ని నీరుగారి పోతున్నాయని ఆందోళన వ్యక్తం అవుతున్న సమయంలో ఇంటివద్దకు మద్యం సరఫరా చేసే ఆలోచనలు చేయమని సుప్రీం కోర్ట్ సూచించడం తెలిసిందే.
ఈ సూచన పట్ల ఇప్పుడు పలు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ఆ మేరకు తమ ఎక్సైజ్ పాలసీల్లో సవరణలకు సిద్ధమవుతున్నాయి.
కేరళలో ఆన్‌లైన్‌లో ఈ-టోకెన్ల జారీ చేసి, టేక్ అవే ద్వారా మద్యం సరఫరా చేయనున్నారు. మహారాష్ట్రలో నేటి నుంచి మద్యం హోమ్ డెలివరీ చేస్తున్నారు. ఢిల్లీలో ఈ-కామర్స్ సంస్థల సాయంతో మద్యం హోమ్ డెలివరీ ప్రతిపాదన చేస్తున్నారు.
తమిళనాడులో మద్యం హోమ్ డెలివరీకి లాజిస్టిక్ సంస్థల సాయాన్ని తీసుకోవడంపై మంతనాలు జరుపుతున్నారు. తెలంగాణ:లో పైవేటు సంస్థల సాయంతో మద్యం హోమ్ డెలివరీకి పరిశీలన చేస్తున్నారు. కర్ణాటకలో ఆన్‌లైన్, హోమ్ డెలివరీ ద్వారా మద్యం అమ్మకాలను ప్రారంభించే యోచన చేస్తున్నారు.