https://oktelugu.com/

Congress: ఆ ఐదు రాష్ట్రాలు కాంగ్రెస్ వే.. తేల్చేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గడ్, మిజోరాం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో మార్పు కనిపించింది.

Written By:
  • Dharma
  • , Updated On : October 18, 2023 9:13 am
    Congress

    Congress

    Follow us on

    Congress: దేశంలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయా? ఈసారి హస్తం పార్టీ ఢిల్లీ పీఠాన్ని అందుకోనుందా? ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సర్వేల్లో కూడా కాంగ్రెస్కు సానుకూల ఫలితాలు వస్తాయని వెళ్లడవుతోంది. సార్వత్రిక ఎన్నికల ముంగిట.. ఐదు రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్ గా భావిస్తున్నారు. అయితే గతం కంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లు పెంచుకొని ఘన విజయం సాధిస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా వెల్లడించడం విశేషం.

    తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గడ్, మిజోరాం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో మార్పు కనిపించింది. అక్కడ విజయంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఊపు వచ్చింది. తెలంగాణలో సైతం కాంగ్రెస్ విజయం తధ్యమని నేతలు భావిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్కు సానుకూల వాతావరణం ఉండడం విశేషం.ఉత్తరాధి రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడిందని టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా అంచనా వేసింది.

    రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ రాష్ట్రాల్లో మొత్తం 520 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 282 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణ, మిజోరాంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 683 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 2018లో కాంగ్రెస్ గెలుచుకున్న సీట్లు 305 వరకు ఉన్నాయి. బిజెపి కేవలం 199 సీట్లను మాత్రమే గెలుచుకుంది. రెండు పార్టీల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. గతంలో బిజెపికి అనుకూలంగా ఉన్న సమయంలోనే ఆ పార్టీకి కీలక స్థానాలు దక్కలేదు. ఇప్పుడు బిజెపికి చేదు ఫలితాలు తప్పవని టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చెబుతోంది.

    ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మెరుగుపడినందున గతం కంటే గణనీయంగా సీట్లు సాధిస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడుతోంది. బిజెపి గట్టిగా పోరాటం చేయవలసి ఉంటుందని చెబుతోంది. మధ్యప్రదేశ్లో బిజెపి కంటే కాంగ్రెస్కే ఎక్కువ సీట్లు వస్తాయని భావిస్తోంది. రాజస్థాన్లో కాంగ్రెస్ మరోసారి అధికారం నిలబెట్టుకోవడానికి హోరాహోరీ పోరు సాగించనుందని అంచనా వేసింది. చత్తీస్గడ్ లో బిజెపికి మళ్ళీ ఓటమి తప్పదని తేల్చేసింది. తెలంగాణలో బి ఆర్ ఎస్ తో కాంగ్రెస్ గట్టిగానే పోరాడుతుందని.. బిజెపి మూడో ప్లేస్ కి పరిమితం కానుందని టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే తేల్చింది. మిజోరంలో సైతం కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అంచనా వేసింది. ఇలా ఎలా చూసుకున్నా ఐదు రాష్ట్రాల్లో హస్తవాసి బాగానే ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా చెబుతోంది. అటు రాహుల్ సైతం అదే ధీమాతో ఉన్నారు. అదే జరిగితే దేశ రాజకీయ ముఖచిత్రం మారనుంది.