Congress vs Bjp: బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ దాడి.. తెలంగాణలో తలపడుతున్న జాతీయ పార్టీలు

Congress vs Bjp: జాతీయ స్థాయిలో ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణలోనూ అంతే ధీటుగా కొట్లాడుకుంటున్నాయి.  ఇక జాతీయ స్థాయిని మించి ఇక్కడ టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. యూపీలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇష్యూను తెలంగాణలో రగిలించాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహంలో కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. బీజేపీపై దాడులకు వెనుకాడడం లేదు. టీ బీజేపీ చీఫ్ బండి […]

Written By: NARESH, Updated On : October 4, 2021 2:50 pm
Follow us on

Congress vs Bjp: జాతీయ స్థాయిలో ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణలోనూ అంతే ధీటుగా కొట్లాడుకుంటున్నాయి.  ఇక జాతీయ స్థాయిని మించి ఇక్కడ టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. యూపీలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇష్యూను తెలంగాణలో రగిలించాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహంలో కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. బీజేపీపై దాడులకు వెనుకాడడం లేదు. టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం అంతే దూకుడు గల నేత కావడంతో ఈ రెండు పార్టీల నేతలు ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టుగా తెలంగాణలో ఫైట్ చేసుకుంటున్నాయి.

తెలంగాణలో బండి సంజయ్, రేవంత్ రెడ్డి సారథ్యంలో జాతీయ పార్టీలు మునుపెన్నడూ లేనంతగా యాక్టివ్ గా నడుస్తున్నాయి. తగ్గేదే అన్నట్టుగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది పరిస్థితి. తాజాగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల మెరుపు ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ నేతృత్వంలో వందలసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీసును ముట్టడించడం ఉద్రిక్తతకు దారితీసింది. మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్ తోపాటు ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్, ఫిషేర్మెన్ కాంగ్రెస్ ఛైర్మన్ మెట్టు సాయి, నాయకులు హర్కర వేణు గోపాల్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, తదితరులు ముట్టడిలో పాల్గొన్నారు.

ప్రియాంక గాంధీ అరెస్ట్, యూపీ లో యోగి ఆదిత్యనాథ్ అరాచక పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ బీజేపీ ముట్టడిని చేపట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేశారు. బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అసలు చచ్చుబడిన కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వచ్చాక ఇంతటి ఉత్సాహం.. దూకుడు.. దాడుల వరకూ వెళ్లిందంటే కాంగ్రెస్ పార్టీ ఎంత యాక్టివ్ గా మారిందో అర్థం చేసుకోవచ్చు.