దేశంలో పలు స్టేట్లలో పార్టీలు అధికారం సాధించడంలో పీకే సూచనలు, సలహాలు పని చేశాయని తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలను గెలిపించిన వ్యక్తిగా పీకేకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటుకు పీకే వ్యూహాలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. దీని కోసం థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించారు. ఇప్పటికే శరత్ పవార్, మమత వంటి నేతల్ని ఒప్పించి వారితో సమావేశం కూడా ఏర్పాటు చేసి వారిలో ఆత్మస్థైర్యం నింపే పనిలో పడ్డారు. దీంతో మూడో కూటమి ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నట్లు చెబుతున్నారు.
అయితే పీకే కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు ఏ పదవి ఇస్తారనేది ఉత్కంఠగా మారుతోంది. పార్టీ వ్యూహకర్తగా పేరున్న అహ్మద్ పటేల్ స్థానం తనకు ఇవ్వాలని పీకే కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త వారికి ఆ పదవి ఇచ్చేందుకు సోనియాగాంధీ సుముఖంగా ఉండరని ప్రచారం సాగుతోంది. దీంతో పీకే కాంగ్రెస్ లో చేరితే ఏఐసీసీ లో ఏదో ఒక పదవి ఇస్తారని ప్రచారం వస్తోంది.
కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించే బాధ్యత పీకే పై నే ఉంది. దీంతో ఆయన తన శక్తియుక్తులను ప్రయోగించి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు ప్రణాళిక రచిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీని గాడిలో పెట్టే పనిలో పడిపోయారు. ఒక్కో రాష్ర్టంలో పరిస్థితులను చక్కదిద్దుతూ విజయతీరాలకు చేర్చాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను గర్తించి వాటిని నెరవేర్చేందుకు పావులు కదుపుతున్నారు.