https://oktelugu.com/

Tuck Jagadish Trailer Talk: కుటుంబం ఓడిపోతే ‘టక్ జగదీష్’ ఓడిపోయినట్టే

Tuck Jagadish Trailer Talk: హీరో నాని ఈ మధ్య ప్రయోగాత్మక చిత్రాలకు పెద్దపీట వేస్తున్నాడు. ‘వీ’తో ఓటీటీ మూవీని ప్రేక్షకులకు అందించిన నాని ఇప్పుడు కుటుంబ విలువలే ప్రధానంగా ‘టక్ జగదీష్’ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. నాని హీరోగా యాక్షన్, కుటుంబ కథా చిత్రంగా వస్తున్న ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.ఐశ్వర్య రాజేశ్, రీతూవర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 10 నుంచి ఈ ‘టక్ జగదీష్’ మూవీ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 1, 2021 / 08:51 PM IST
    Follow us on

    Tuck Jagadish Trailer Talk: హీరో నాని ఈ మధ్య ప్రయోగాత్మక చిత్రాలకు పెద్దపీట వేస్తున్నాడు. ‘వీ’తో ఓటీటీ మూవీని ప్రేక్షకులకు అందించిన నాని ఇప్పుడు కుటుంబ విలువలే ప్రధానంగా ‘టక్ జగదీష్’ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. నాని హీరోగా యాక్షన్, కుటుంబ కథా చిత్రంగా వస్తున్న ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.ఐశ్వర్య రాజేశ్, రీతూవర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 10 నుంచి ఈ ‘టక్ జగదీష్’ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల అవుతోంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తే యాక్షన్, భావోద్వేగ కుటుంబ కథా చిత్రమని అర్థమవుతోంది.

    గ్రామంలో ‘వీరేంద్ర’ అనే విలన్ కు భయపడకుండా ఎదురుతిరిగే టక్ జగదీష్ గా నాని ఎంట్రీ అదిరింది. గ్రామంలో తమ కుటుంబాన్ని టార్గెట్ చేసిన ప్రత్యర్థులను ఎదురించి నిలిచి తన కుటుంబాన్ని కాపాడే హీరోగా నాని నటించాడు. అన్నదమ్ములైన జగపతిబాబు, నాని మధ్య సాగే సంభషణాలు, కెమిస్ట్రీ హైలెట్ గా చెప్పొచ్చు.

    ‘నా కుటుంబం ఓడిపోతే నేను ఓడిపోయినట్టే’ అని నాని చెప్పే ఏమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంది. ఇక భూకక్షలు లేని భూదేవిపురం చూడాలన్న కుటుంబం కలను నాని నెరవేర్చాడా? ఈ క్రమంలోనే విభేదాలతో విడిపోయిన కుటుంబం మళ్లీ కలిసిందా? అన్నది ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.

    నిన్నుకోరి లాంటి గ్రాండ్ హిట్ తర్వాత శివనిర్వాణ-నాని కాంబినేషన్ వస్తోన్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించేలానే ఉంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు సిద్ధమైంది.