టీ.కాంగ్రెస్ కు ఊపుతెచ్చే ప్లాన్ చేశారు?

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. నేతలు తలోదారిలో వెళ్తున్నారు. నడిపించే నాయకుడు లేక కునారిల్లుతోంది. ఇక బీజేపీ దూసుకొస్తోంది. కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఊపుతెచ్చే ప్లాన్ కు సిద్దమైంది. కాంగ్రెస్ లో కథనోత్సాహాన్ని తేవాలని యోచిస్తోంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీనివ్వాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో రథయాత్ర చేపట్టాలని ఆలోచిస్తోంది. Also Read: కాంగ్రెస్ తో […]

Written By: NARESH, Updated On : August 25, 2020 7:30 pm
Follow us on


తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. నేతలు తలోదారిలో వెళ్తున్నారు. నడిపించే నాయకుడు లేక కునారిల్లుతోంది. ఇక బీజేపీ దూసుకొస్తోంది. కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఊపుతెచ్చే ప్లాన్ కు సిద్దమైంది. కాంగ్రెస్ లో కథనోత్సాహాన్ని తేవాలని యోచిస్తోంది.

రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీనివ్వాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో రథయాత్ర చేపట్టాలని ఆలోచిస్తోంది.

Also Read: కాంగ్రెస్ తో కటీఫ్ అంటున్న కోదండరాం?

హైదరాబాద్ లో నిర్వహించే కాంగ్రెస్ రథయాత్రలో కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొనేలా అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. జంట నగరాల్లోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఇందులో పాల్గొనేలా ప్లాన్ రెడీ చేశారు.

కాగా ఈ రథయాత్రకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నాయకత్వం వహిస్తారని.. సీనియర్ నేత వీ హనుమంతరావు కూడా అందులో భాగం అవుతాడని పార్టీ వర్గాలు చెబుతున్నారు.

ఒకప్పుడు హైదరాబాద్ లో కాంగ్రెస్ అత్యంత బలంగా ఉండేది.. దానం నాగేందర్ ముఖేష్ గౌడ్, పి. జనార్ధన్ రెడ్డి, శశిధర్ రెడ్డి లాంటి బలమైన నేతలు కాంగ్రెస్ లో ఉండేవారు. కానీ ఈ నాయకులలో ఎక్కువమంది టీఆర్ఎస్ లో చేరిపోయారు. కొందరు బలహీనపడ్డారు. దీంతో హైదరాబాద్ లో కొత్త నాయకత్వాన్ని సృష్టించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ క్రమంలోనే రథయాత్రను అందుకు ఊతంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.

Also Read: అపెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ టార్గెట్ ఇదే…!

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోయిన సారి మూడో స్థానానికి కాంగ్రెస్ పడిపోయింది. ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ లో ఒక్క కార్పొరేటర్ కూడా జీహెచ్ఎంసీలో లేరు. రెండోస్థానంలో బీజేపీ ఉంది.

ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ ను తట్టుకొని కనీసం రెండో స్థానం దక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే రథయాత్ర ఎంత సక్సెస్ అవుతుందనే దానిపై కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంది.