https://oktelugu.com/

నయన్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విఘ్నేష్

సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ గా నయనతార కొనసాగుతోంది. లేడి సూపర్ స్టార్ గా నయనతార స్టార్డమ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు సినిమా విషయాల కంటే లవ్ ఎఫెర్స్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటోంది. నయనతార వరుసగా ఒకటి రెండు సినిమాలు ఏ హీరోతోనైనా సినిమాలు చేస్తే చాలు కోలీవుడ్లో ఆమెపై గుసగుసలు విన్పిస్తుంటాయి. ఇండస్ట్రీలో నయనతారపై వచ్చిన లవ్ ఎఫెర్స్ మరో హీరోయిన్ పై రాలేదంటే అతిశయోక్తి కాదేమో..! Also Read: భారీ ఆఫర్ను […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 25, 2020 / 07:39 PM IST
    Follow us on


    సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ గా నయనతార కొనసాగుతోంది. లేడి సూపర్ స్టార్ గా నయనతార స్టార్డమ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు సినిమా విషయాల కంటే లవ్ ఎఫెర్స్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటోంది. నయనతార వరుసగా ఒకటి రెండు సినిమాలు ఏ హీరోతోనైనా సినిమాలు చేస్తే చాలు కోలీవుడ్లో ఆమెపై గుసగుసలు విన్పిస్తుంటాయి. ఇండస్ట్రీలో నయనతారపై వచ్చిన లవ్ ఎఫెర్స్ మరో హీరోయిన్ పై రాలేదంటే అతిశయోక్తి కాదేమో..!

    Also Read: భారీ ఆఫర్ను కాదనుకున్న మెగా హీరో!

    నయనతార ప్రేమ.. పెళ్లి మీడియాలో నిత్యం హాట్ టాపిక్ గా ఉంటోంది. ఇప్పటికే పలువురు హీరోలతో ప్రేమాయణం నడిపిన నయనతార పెళ్లివరకు తీసుకెళ్లలేకపోయింది. ప్రేమలో విఫలమవుతూనే.. మళ్లీ ప్రేమలో పడుతూ లేస్తుంటుంది నయనతార. ఇటీవల ఓ ప్రముఖ కోరియోగ్రాఫర్ తో పెళ్లిపీఠల వరకు వెళ్లి చివరి నిమిషంలో క్యాన్సల్ చేసుకుంది. ఆ తర్వాత దర్శకుడు విఘ్నేష్ తో ప్రేమాయణం కొనసాగిస్తుంది.

    తాజాగా నయన్ తో పెళ్లిపై ఆమె ప్రియుడు విఘ్నేష్ ఓ ఇంటర్య్వూలో స్పందించాడు. తనకు నయనతార ఇప్పటికే మీడియాలో 22సార్లు పెళ్లయిందని చమత్కరించాడు. తామిద్దరం వృత్తి విషయంలో సాధించాల్సి ఇంకా ఉందని చెప్పాడు. అందుచేత పెళ్లి గురించి పెద్దగా ఆలోచించడం లేదని చెప్పాడు. ప్రస్తుత కొనసాగిస్తున్న డేటింగ్ లైఫ్ బోర్ కొడితే.. అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానంటూ విఘ్నేష్ చెప్పుకొచ్చాడు.

    Also Read: రాశి ఖన్నా డేరింగ్‌ స్టెప్‌..

    ఇదిలా ఉంటే ఇటీవల మీడియాతో తనకు.. నయనతారకు కరోనా పాజిటివ్ వచ్చిందని వార్తలు వచ్చాయని.. ఇది తనను ఎంతో బాధించిందని చెప్పాడు. కాగా విఘ్నేష్ ప్రస్తుతం ‘కాటు వాకుల రెండు కాదల్‌’ అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా నయనతార, సమంత హీరోయిన్లుగా కనిపించనున్నారు. నయనతార పెళ్లికి ఇంకా చాలా టైంపడుతుందని విఘ్నేష్ ఇన్ డైరెక్టుగానే హింట్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరు మరికొన్ని రోజులపాటు ప్రేమపక్షుల్లానే విహరించడం ఖాయంగా కన్పిస్తోంది.