Congress President: సచిన్ వస్తాడు..సెంచరీ కొడతాడు..భారత్ ను గట్టెక్కిస్తాడు..90వ దశకంలో సగటు భారతీయుడు ఆలోచన విధానమిది. అటు తరువాత భారత క్రికెట్ లో సంస్కరణల పుణ్యమా అని మెరుపు తీగల్లాంటి క్రీడాకారులు తెరపైకి వచ్చారు. జట్టు ఏ ఒక్క సభ్యుడిపైనా ఆధారపడకుండా అందరూ కలిసికట్టుగా ఆడి ప్రపంచంలోనే చాంపియన్ టీమ్ గా ఇండియా ఖ్యాతిని దక్కించుకుంది. అయితే నాడు ఇండియన్ టీమ్ కు ఏ విధంగా సంస్కరించారో.. ఇప్పుడు ఆ అవసరం ఇండియన్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కానీ సంస్కరించేందుకు అగ్రనేత సోనియా గాంధీ ముందుకు రావడం లేదు. అధ్యక్ష పదవి తీసుకునేందుకు రాహూల్ గాంధీ ఆసక్తికనబరచడం లేదు.దీంతో కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం రోజురోజుకూ ముదిరిపాకన పడుతోంది. నేతల రాజీనామా పరంపర కొనసాగుతోంది. నాయకులు ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారు. మేల్కొవాల్సిన అగ్ర నాయకత్వం ఏమీ పట్టనట్టుగా ఉంటోంది. వాస్తవానికి 2014 ఎన్నికల్లో ఓటమి నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. కేంద్రంలో అధికారానికి దూరమైన ఆ పార్టీకి సంక్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. అధికారంలో ఉన్న ఒక్కో రాష్ట్రం దూరమైంది. అటు బీజేపీ తన ప్రాభవాన్ని పెంచుకుంటోంది. ప్రధాని మోదీ శక్తివంతమైన నేతగా ఎదుగుతున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహంతో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఈ సమయంలో శక్తినంత పోగు చేసి..శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి.. కార్యోన్ముఖులు చేయాల్సిన నాయకత్వం కాంగ్రెస్ పార్టీలోకనిపించడం లేదు. అయితే ఇప్పుడు అనూహ్యంగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ ను కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై కూర్చోబెడతారని తెలుస్తుండడం కాంగ్రెస్ పార్టీలో మిశ్రమ స్పందన లభిస్తోంది. ‘అవును ఆయనకు తక్కువ వయస్సే..సోనియా గాంధీ కంటే తక్కువే.. అందుకే ఎంపీక చేస్తారు’ అంటూ కామెంట్స్ మొదలయ్యాయి.

ఇదేనా మీరిచ్చే సందేశం
అయితే గెహ్లట్ నియామకం ద్వారా పార్టీ శ్రేణులకు అధి నాయకత్వం ఏ సందేశం ఇవ్వదలచుకుందో తెలియడం లేదు. కాంగ్రెస్ పార్టీకి యువ నాయకత్వం రాబోతోంది. పార్టీలో యువరక్తం నింపుతాం. కింది స్థాయి నుంచి ఢిల్లీ కమిటీల వరకూ యువతకు ప్రాధాన్యమిస్తాం.. ఇటువంటి ప్రకటనలు గత ఎనిమిది సంవత్సరాలుగా వినబడుతూనే ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి కార్యరూపం దాల్చడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో చాలావరకూ మూర్ఖపు అభిమానం కొనసాగుతోంది. మరోవైపు సీనియర్లు పార్టీకి భారంగా మారారు. వారి వల్ల యువ నాయకత్వానికి సరైన ప్రోత్సాహం లేదు. అయితే అధిష్టానం కూడా సీనియర్లకు ప్రాధాన్యతతో పాటు వారి లాభియింగ్ కు ఇతోధికంగా ప్రోత్సహిస్తుండడంతో యువ నాయకులు ఒక్కొక్కరుగా దూరమవుతూ వస్తున్నారు. కాంగ్రెస్ తో పెన వేసుకున్న కుటుంబాల నుంచి వచ్చిన యువ నాయకులు సైతం విసిగి వేశారి తమ దారి తాము చూసుకున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో యువ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీని అప్పగించి.. సమూలంగా సంస్కరిస్తే మాత్రం ఫలితముంటుంది. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ జవసత్వాలను సమూలంగా తొలగించడం అసమాన్యం. అది సాధ్యం కాని పని. కానీ పార్టీని నడిపించే సమర్థ నాయకత్వం లేకపోవడం ఆ పార్టీకి లోటే..
Also Read: Apple: చైనాకు ఆపిల్ రాం రాం.. అన్ని దేశాలను కాదని భారత్ వైపు చూపు
కష్టం వస్తే గర్తుచ్చేది రాహుల్..
కాంగ్రెస్ పార్టీకి కష్టం వచ్చిన ప్రతీసారి పార్టీ శ్రేణులు ఆ పార్టీ యువ నాయకుడు రాహూల్ గాంధీ వైపు బేల చూపులు చూస్తుంటాయి. పార్టీని ఒడ్డున పడేయాలని వేడుకుంటాయి. కానీ ఏళ్లు గడుస్తున్నా ఆయన అధ్యక్ష పీఠంపై ఎక్కడం లేదు. పార్టీని సంస్కరించడం లేదు. దీని వెనుక చాలారకాల కారణాలున్నాయి. పార్టీకి యువ రక్తాన్ని ఎక్కించాలని ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ వీలుపడడం లేదు. వృద్ధ జంబుకాలను పార్టీ నుంచి తరిమేయ్యాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నా ఫలించడం లేదు. కాంగ్రెస్ అగ్రనేతగా ఉన్నా పార్టీలో రాహూల్ మాట చెల్లుబాటు కావడం లేదు. సీనియర్లను కాదని ఏం చేయలేమని ఆయన తల్లి సోనియా సలహ ఇచ్చారేమో కానీ.. అందుకే అధక్ష పదవిని తీసుకునేందుకు రాహూల్ సుతారం ఇష్టపడడం లేదు. చాలా సార్లు ఇదే విషయమై రాహుల్ విన్నవించినా అగ్ర నాయకత్వం పట్టించుకోలేదు. సీనియర్లను పక్కనపెడితే పార్టీ నిట్టనిలువునా చీలుతుందన్న భయమో..లేక ఏ ఇతర కారణాలో తెలియదు కానీ సోనియా ఈ విషయంలో సైలెంట్ అయిపోయారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాహుల్ అధ్యక్ష పీఠానికి దూరంగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే సీనియర్ల విషయంలో అధినాయకత్వం నిర్ణయంపై అలిగారని మాత్రం తెలుస్తోంది.

వారిద్దరి కంటే జూనియర్..
అయితే సుదీర్ఘ చరిత్ర కలిగి, సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి ఇప్పుడు ఒక నేత అవసరం. మరోవైపు అసమ్మతి నాయకులు కూటమి కట్టారు. పార్టీలో ఒక్కొక్కరు బయటకు పోతున్నారు. ఇటువంటి సమయంలో సంస్కరించే బదుు ఒక సీనియర్ కు పదవి అప్పగిస్తే పరిస్థితులు కొంతవరకూ సర్దుకుంటాయని సోనియా భావించినట్టున్నారు. అందుకే తనకంటే వయసురీత్యా జూనియర్ అయిన అశోక్ గెహ్లట్ ను పార్టీ అధ్యక్ష పదవిపై కూర్చోబెట్టాలని నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం గెహ్లట్ వయసు 71 సంవత్సరాలు, సోనియా వయసు 75 సంవత్సరాలు, ప్రధాని మోదీ వయసు 72 సంవత్సరాలు. అటు ప్రధాని మోదీ, ఇటు తన కంటే జూనియర్ అయిన గెహ్లట్ ను ఎంపిక చేశారు.
రాజకీయాల్లో ఆరితేరిన ఈ వృద్ధ జంబూకం కాంగ్రెస్ ను ఎలా గట్టిక్కిస్తాడన్నది ప్రశ్న. ఇప్పటికే వృద్ధులతో కాంగ్రెస్ నిండిపోయింది.యువతను ఎదగనీయడం లేదు. వారి వల్ల పార్టీ భ్రష్టు పట్టిపోతోంది. మళ్లీ గెహ్లాట్ కే పగ్గాలు ఇస్తే ముసలి నేతలదే రాజ్యం అవుతుంది. యువతకు అధికారం కల్ల అవుతుంది. కాంగ్రెస్ మరో తప్పు చేస్తోందని.. ఇలాంటి వృద్ధులకు రిటైర్ మెంట్ ఇచ్చి యువతకు బాధ్యతలు అప్పజెప్పాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
Also Read:Delhi Liquer Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఎంత? బీజేపీ ఆరోపణల్లో నిజం ఎంత?
[…] […]