Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలు తమదైన శైలిలో ముందుకు వెళుతున్నాయి. దీంతో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావించి తమ వైఖరులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా తన విధానాలకు పదును పెడుతోంది ఇన్నాళ్లు రాజకీయాలు చేసినా ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కు అధికారం చేపట్టే అవకాశాలే కనిపించడం లేదు. దీంతో ఆ పార్టీ ఆలోచనలో పడిపోయింది. ఎలాగైనా అధికారం సాధించాలనే పట్టుదలైతే ఉంది కాని దానికి సంబంధించిన కార్యాచరణ ఇంకా అమలు చేయడం లేదు.
ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో పెద్దగా ప్రయోజనం చేకూరే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు కోల్పోయి చాలా కాలం అయింది. ఈ నేపథ్యంలో అధికార మార్పిడి ద్వారా ఓట్లు సాధించాలని భావించినా అది సాధ్యం కాదని తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వైఖరి ఏంటనేది అంతుచిక్కడం లేదు.
యూపీలో బ్రాహ్మణుల ఓట్లే అధికం. కాంగ్రెస్ పార్టీ వారి ఓట్లు కోల్పోయి చాలా కాలం అయింది. దీంతో వారి ఓట్లు తిరిగి రాబట్టుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ప్రజలు మాత్రం విశ్వసించడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోందనేదే ప్రశ్న. కాంగ్రెస్ యూపీ బాధ్యుడిగా బ్రాహ్మణ వర్గానికి చెందిన వాడినే నియమించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఎన్ని కుయుక్తులు పన్నినా కాంగ్రెస్ ను ప్రజలు నమ్మడం లేదనే విషయం మాత్రం స్పష్టం అవుతోంది.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించినా పెద్దగా ప్రయోజనం ఉండదనే విషయం తెలుస్తోంది. యూపీలో విజయం దక్కించుకోవడం అంత సులువు కాదని అర్థమవుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నా ఇప్పుడు ప్రభావం చూపకపోవచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం కలేనా అనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతోంది.
బహుజన సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు విడిగా పోటీ చేస్తే అది బీజేపీకే లాభం చేస్తుంది. ఒకవేళ కలిసి పోటీ చేస్తే మాత్రం ఆలోచించాల్సిందే. పైగా సమాజ్ వాదీ పార్టీకి మాత్రమే యూపీలో ప్రజల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అఖిలేష్ యాదవ్ నే ప్రజలు విశ్వసిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ లెక్కలు వేసుకుని పోటీ చేస్తుందో చూడాలి మరి.