Revanth Reddy: కాంగ్రెస్ లో వ్యూహాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థి ఎవరనేది అంత ఈజీగా తేలదు. ఎన్నికలు అయిపోయిన తర్వాతే హై కమాండ్ నిర్ణయిస్తుంది. గతంలో ఇలాగే జరిగేది. కానీ ఇప్పడు రాహుల్ గాంధీ కొత్త విధానానికి తెర లేపారు. పంజాబ్ లో ప్రస్తుత సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీనే సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేసింది కాంగ్రెస్. అంటే వ్యక్తిగత ఇమేజ్‌ను వాడుకుంటుందన్న మాట.
గతంలో కేవలం కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ తో మాత్రమే ఎన్నికలకు వెళ్లేది. కానీ ఇప్పుడు లోకల్ గా బలమైన లీడర్లను ముందు పెట్టి వారి ఇమేజ్ తో ఎన్నికల్లో గెలవాలనేది కొత్త ప్లాన్. అందుకే పంజాబ్ లో అలా చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా ఇలాగే ముందు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారా అనే అంశం చర్చకు వస్తోంది.
అదే జరిగితే ఎప్పటి నుంచో సీఎం అవ్వాలని ఆశ పడుతున్న రేవంత్ రెడ్డికి అన్ని రకాలుగా అవకాశం ఉంటుందని ఆయన వర్గం భావిస్తోంది. ఎంతమంది సీనియర్లు ఉన్నా రేవంత్‌కు పగ్గాలు ఇవ్వడంతో పార్టీని గాడిలో పెట్టి పూర్వ వైభవం తీసుకువచ్చే బాధ్యతను ఇచ్చింది హైకమాండ్. అయితే రేవంత్ కూడా తనకు తాను బలమైన నేత అని నిరూపించుకునే పనిలో పడ్డారు. తనను తాను నిరూపించుకుంటే.. కచ్చితంగా తాను సీఎం క్యాండిడేట్ అని భావిస్తున్నారు.
Also Read: Revanth Reddy: ఏకంగా కేసీఆర్ కే ఎసరు పెడుతున్న రేవంత్ రెడ్డి
ఇందుకు తగ్గట్టే పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. తన వర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెంచుకుంటున్నారు. రాబోయే కాలంలో అన్ని జిల్లాల్లో తన వర్గం ఉండేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. పైగా టీఆర్ ఎస్, బీజేపీకి ధీటుగా సమాధానం కూడా చెప్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు ఎలాగైతే టీడీపీలో వర్గాన్ని పెంచుకుని.. పార్టీని తన ఆధీనంలోకి తీసుకున్నారో.. ఇప్పుడు రేవంత్ కూడా అదే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఎంత పార్టీని తన ఆధీనంలో పెట్టుకున్నా కూడా.. ఇప్పుడు పంజాబ్‌లో వేస్తున్న ప్లాన్ వర్కౌట్ కాకపోతే కాంగ్రెస్ మిగతా రాష్ట్రాల్లో ఆ వ్యూహాన్ని అమలు చేయకపోవచ్చు. అదే జరిగితే రేవంత్‌కు, ఆయన వర్గానికి షాక్ తప్పదు. మరి భవిష్యత్ ఎలా ఉంటుందో కాలమే సమాధానం చెప్పాలి.
Also Read: కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందన్న మోడీ.. తెర వెనక అసలు వ్యూహం ఇదే..!