Sam Pitroda: ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) హ్యాక్ అవుతున్నాయని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఆరోపించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీటిని వాడొద్దని సూచించారు. మస్క్ చేసిన ఈ వ్యాఖలు భారత్‌లో ప్రకంపనలు రేపాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా కూడా ఈవీఎంలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హ్యాకింగ్‌కు అవకాశం..
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు(ఈవీఎం)లను ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉందని పిట్రోడా తెలిపారు. దీంతో ఫలితాలను తారుమారు చేయవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈమేరకు ఎక్స్ వేదికగా కీలక పోస్టులు చేశాడు.
ట్వీట్ ఇలా..
‘ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్‌వేర్, కాంప్లెక్స్ సిస్టం రంగాల మీద సుమారు అరవై ఏళ్లపాటు నేను పనిచేశాను. అదే విధంగా నేను ఈవీఎం యంత్రాల వ్యవస్థను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయటం సాధ్యం అవుతుంది. దీని వల్ల ఫలితాలకు కూడా మారిపోతాయి. ఇటువంటి సమయంలో సంప్రదాయ పాత బ్యాలెక్ ఓటింగ్ విధానమే చాలా ఉత్తమమైంది. ఓట్ల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి‘ అని పేర్కొన్నారు.
Also Read: Hindu kings : ముస్లిం యువరాణిలను వివాహం చేసుకున్న హిందూ రాజులు వీరే
వీవీప్యాట్‌ల సహాయంతో..
ఇక పిట్రోడా మరో పోస్టులో ‘పోలింగ్లో ఉపయోగించే ఈవీఎం మిషన్లతో పాటు, వీవీప్యాట్ స్లిప్స్ కోసం వీవీప్యాట్ యాంత్రాలు కూడా అమర్చబడి ఉన్నాయి. వీవీప్యాట్ యంత్రాల సాయంతో కూడా ఈవీఎంలను హ్యాక్ చేయడానికి అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది’ అని పేర్కొన్నాడు.
సార్వత్రిక ఎన్నికల వేళ..
ఇటీవల భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వీవీప్యాట్, ఓటర్ల జాబితా, వేసిన ఓట్లు, లెక్కించిన ఓట్లు, మొత్తం ఓట్లు, విజేతలు(ఓట్లు) ఓడిపోయినవారికి పోలైన ఓట్లు వంటి వాటిపై గందరగోళం నెలకొంది. వీటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’ అని శ్యామ్ పిట్రోడా సూచించారు.
Also Read: EVM Hacking: ఫ్యాక్ట్ చెక్.. నిజంగా ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చా? నిజమెంత?
మస్క్ ఆరోపణలపై స్పందించిన ఈసీ..
ఇదిలా ఉంటే… ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈవీఎంలు అస్సలు హ్యాక్ చేయరాదని తెలిపింది. భారత్‌లో ఉపయోగించే ఈవీఎంలకు బ్లూటూత్, వైఫై, ఇంటర్‌నెట్ వంటి వైర్లెస్, వైర్ కనెక్షన్లు ఉండవని పేర్కొంది. ఈ క్రమంలో ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా శ్యామ్ పిట్రోడా లేవనెత్తిన వీవీప్యాట్ మిషన్ల అంశంతో ఈవీఎంలను హ్యాక్ చేయడానికి అవకాశం ఉన్నట్లు వస్తున్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Congress leader sam pitrodas sensational comments on evms tampering
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com