https://oktelugu.com/

Congress vs BJP : తండ్రి రెండుసార్లు సీఎం.. బీజేపీలో చేరనున్న తెలంగాణ  సీనియర్ నేత.. కాంగ్రెస్ కు భారీ షాక్

Congress vs BJP : కాంగ్రెస్ లో ఆయన తండ్రి రెండు సార్లు  సీఎంగా చేశారు. మర్రి చెన్నారెడ్డి వారసుడిగా కాంగ్రెస్ లోనూ వెలుగు వెలిగారు.   కానీ తెలంగాణలోనే సీనియర్ నేత..  మర్రి శశిధర్ రెడ్డికి ఇప్పటికీ కాంగ్రెస్ పై వెగటు పుట్టింది. తెలంగాణలో రోజురోజుకు దిగజారుతున్న కాంగ్రెస్ నావను విడిచి పటిష్టమైన బీజేపీ ఓడలోకి ఎక్కేందుకు రెడీ అయ్యారు. రోజురోజుకు బలపడుతున్న బీజేపీలో ఉంటేనే తన భవిష్యత్ బాగుంటుందని ఓ నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2022 / 11:10 AM IST
    Follow us on

    Congress vs BJP : కాంగ్రెస్ లో ఆయన తండ్రి రెండు సార్లు  సీఎంగా చేశారు. మర్రి చెన్నారెడ్డి వారసుడిగా కాంగ్రెస్ లోనూ వెలుగు వెలిగారు.   కానీ తెలంగాణలోనే సీనియర్ నేత..  మర్రి శశిధర్ రెడ్డికి ఇప్పటికీ కాంగ్రెస్ పై వెగటు పుట్టింది. తెలంగాణలో రోజురోజుకు దిగజారుతున్న కాంగ్రెస్ నావను విడిచి పటిష్టమైన బీజేపీ ఓడలోకి ఎక్కేందుకు రెడీ అయ్యారు. రోజురోజుకు బలపడుతున్న బీజేపీలో ఉంటేనే తన భవిష్యత్ బాగుంటుందని ఓ నిర్ణయానికి వచ్చారు.

    తెలంగాణ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి  కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మర్రి భేటి కావడం కాంగ్రెస్ వర్గాలను షాక్ కు గురిచేశాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, మాజీ మంత్రి డీకే అరుణతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి కేంద్రహోంమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో మర్రి బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం మొదలైంది.

    -రేవంత్ రెడ్డిపై అసంతృప్తితోనే..
    తెలంగాణ కాంగ్రెస్ ను టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి లీడ్ చేయడంపై ఆది నుంచి మర్రి శశిధర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ లో ఇన్నాళ్లు ఉన్న తమను కాదని పక్కపార్టీ నుంచి వచ్చిన నేతకు పగ్గాలు ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డికి దూరంగా జరిగారు. తెలంగాణ్ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్యం టాగూర్, రేవంత్ పైనా ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ లో కల్లోలానికి ఇద్దరే కారణమని ఆరోపించారు.

    -కాంగ్రెస్ లోనే సీనియర్ గా మర్రి శశిధర్ రెడ్డి
    మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన వారసుడిగా కాంగ్రెస్ అధినాయకత్వంతో శశిధర్ రెడ్డి సన్నిహితంగా మెలిగారు. సీనియర్ నేతగా గుర్తింపు పొందాడు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ లో మర్రి శశిధర్ రెడ్డి, పీ జనార్ధన్ రెడ్డిలు కలిసి రాజకీయాలను శాసించారు. వైఎస్ కూడా వీరికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మర్రి శశిధర్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 1992, 1994, 2004, 2009 ఎన్నికల వరకూ వరుసగా గెలుస్తూ వచ్చారు. 2014లోనూ కాంగ్రెస్ తరుఫున సనత్ నగర్ లో పోటీచేసి అప్పటి టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. 2018లో పొత్తులో భాగంగా సనత్ నగర్ ను టీడీపీకి కాంగ్రెస్ కేటాయించింది. ఇక సోనియా, రాహుల్ వద్దకు నేరుగా వెళ్లి కూడా మాట్లాడేంత చొరవ, పరపతి మర్రి సొంతం.

    తొలి నుంచి కాంగ్రెస్ లోనే ఉండి.. కాంగ్రెస్ లోనే ఎదిగిన మర్రి కుటుంబం ఇలా బీజేపీలో చేరడం చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయడం వల్లనే మర్రి మారారని అంటున్నారు. ఇదే తరహాలో కాంగ్రెస్ లో అసంతృప్తితో ఉన్న చాలా మంది పార్టీ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని సమాచారం. మరికొద్దిరోజుల్లోనే కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు బీజేపీలోకి ఉండబోతున్నాయనట.. అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను కుదేలు చేసి.. టీఆర్ఎస్ ను ఓడించేందుకు ఈ సీనియర్ కాంగ్రెస్ నేతలు బీజేపీకి బలంగా ఉంటారని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే ఈ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదించారని తెలుస్తోంది.