Nidhi Agarwal: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ లేటెస్ట్ కామెంట్ వైరల్ గా మారింది. కలగ తలైవన్ డైరెక్టర్ తనని ఆడిషన్ చేసిన తీరును ఆమె వెల్లడించారు. తెలుగుతో పాటు తమిళంలో చిత్రాలు చేస్తుంది నిధి అగర్వాల్. గత ఏడాది ఆమె నటించిన ఈశ్వరన్, భూమి చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు తమిళ చిత్రాలు ఆకట్టుకోలేదు. ఉదయ్ నిధి స్టాలిన్ కి జంటగా కలగ తలైవన్ మూవీ చేశారు. ఈ చిత్రం నవంబర్ 18న థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో నిధి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కలగ తలైవన్ దర్శకుడు మాగిజ్ తిరుమేని తనను చూడగానే ముఖం కడుక్కో అన్నాడట.

కలగ తలైవన్ దర్శకుడిని నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆయన్ని నేను కలిశాను. నన్ను చూసిన వెంటనే ముఖం కడుక్కొని రమ్మన్నారు. ఈ మూవీలో మేకప్ వేసుకోకుండా నటించాలి. కాబట్టి మేకప్ తొలగించమన్నారు. మేకప్ లేకుండా నా ముఖ కవళికలు మీద షూట్ చేశారని నిధి అగర్వాల్ చెప్పారు. కలగ తలైవన్ మూవీలో నటించడం మంచి అనుభూతుని ఇచ్చిందని నిధి అగర్వాల్ తెలియజేశారు.
కాగా నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ కి జంటగా హరి హర వీరమల్లు మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్ర తాజాగా షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. పవన్ కళ్యాణ్ పై కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్లు సమాచారం. దర్శకుడు క్రిష్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా హరి హర వీరమల్లు తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో హరి హర వీరమల్లు తెరకెక్కుతుంది. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో హరి హర వీరమల్లు విడుదల కానుంది. నిధి అగర్వాల్ తో పాటు నోరా ఫతేహి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.

హరి హర వీరమల్లు పై నిధి చాలా ఆశలే పెట్టుకున్నట్లు ఉన్నారు. ఈ మూవీ విలయం సాధిస్తే తన కెరీర్ సెట్ అవుతుందని భావిస్తున్నారు. సవ్యసాచి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి, అఖిల్ కి జంటగా మిస్టర్ మజ్ను మూవీ చేశారు. నిధి కెరీర్లో ఫస్ట్ హిట్ ఇస్మార్ట్ శంకర్. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మంచి అందుకుంది. ఈ ఏడాది హీరో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మరి హరి హర వీరమల్లు నిధికి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.