Ghulam Nabi Azad: ఆజాద్ కూడా పాయే.. కాంగ్రెస్ ను ఇక ఎవరూ కాపాడలేరు! రాహుల్ పై సంచలన వ్యాఖ్యలు

Ghulam Nabi Azad: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మోడీ దెబ్బకు రెండు సార్లు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కునారిల్లుతోంది ఆపార్టీ. పైగా సోనియాగాంధీ నాయకత్వాన్ని ఎదురించి కొత్త నాయకత్వం కావాలంటూ కాంగ్రెస్ లోని 23 మంది సీనియర్లు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుకు సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ నేతృత్వం వహించారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు సోనియా, రాహుల్, ప్రియాంకలు గులాంనబీని కాంగ్రెస్ పార్టీ […]

Written By: NARESH, Updated On : August 26, 2022 12:11 pm
Follow us on

Ghulam Nabi Azad: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మోడీ దెబ్బకు రెండు సార్లు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కునారిల్లుతోంది ఆపార్టీ. పైగా సోనియాగాంధీ నాయకత్వాన్ని ఎదురించి కొత్త నాయకత్వం కావాలంటూ కాంగ్రెస్ లోని 23 మంది సీనియర్లు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుకు సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ నేతృత్వం వహించారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు సోనియా, రాహుల్, ప్రియాంకలు గులాంనబీని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు దాదాపు దూరంగా జరిపారు.

కాంగ్రెస్ లో ఒంటరిని చేయడం.. దూరం పెట్టడంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న గులాం నబీ ఆజాద్ ఎట్టకేలకు బయటపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గులాం నబీ లాంటి నేత కాంగ్రెస్ నుంచి వైదొలగడం పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్టు గులాం నబీ అధిష్టానానికి లేఖ రాశారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ దెబ్బకు ప్రాభవాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోతోంది. కాంగ్రెస్ లో యువరక్తం రావాలని.. సోనియా కుటుంబ పాలన పోవాలని గులాంనబీ లాంటి సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్ స్వస్తి పలికాలని అంటున్నారు. ఈ క్రమంలోనే గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో సంస్థాగతంగా మార్పుపై అజాద్ తీవ్రంగా గళమెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు.

50 ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని తెంచుకోవడం బాధేస్తోందంటూ 8 పేజీల రాజీనామా లేఖ రాసి సోనియాకు పంపారు ఆజాద్. ఎందుకు తాను రాజీనామా చేయాల్సి వచ్చిందో అందులో వివరించారు. ఆ లేఖ సంచలనమైంది. రాహుల్ గాంధీ తీరును తప్పుపట్టారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ నాశనమైందని.. పార్టీ విధానాలు, అంతర్గత వ్యవహారాలు అస్సలు బాగాలేవన్నారు. పార్టీలో సంప్రదింపుల ప్రక్రియ లేదని.. సీనియర్లను రాహుల్ పక్కనపెట్టారంటూ ఫైర్ అయ్యారు. రాహుల్ ది చిన్న పిల్లల మనస్తత్వం అని.. ఈ కాంగ్రెస్ దుస్థితికి రాహుల్ కారణమని అతడిపై బాంబులు వేసి మరీ ఆజాద్ తప్పుకున్నారు.

ఇక మరో కారణం కూడా ఆజాద్ రాజీనామా వెనుక ఉందని అంటున్నారు. అజాద్ ను మోడీ ఇటీవల కీర్తించడం.. కలిసి చర్చలు జరపడం అయ్యింది. ఉపరాష్ట్రపతిగా ముస్లిం అయిన ఆజాద్ ను చేస్తారని బీజేపీ కడవరకూ ప్రచారం చేసింది. దీంతో కాంగ్రెస్ లో దక్కని అత్యున్నత పదవి బీజేపీలో దక్కుతుందని ఆజాద్ ఆశపడ్డారు. కానీ మోడీ మాత్రం అజాద్ కు హ్యాండ్ ఇచ్చి బీజేపీ వ్యక్తినే ఉపరాష్ట్రపతిని చేశారు. అప్పటి నుంచి ఇటు కాంగ్రెస్ కు, అటు బీజేపీకి సమదూరంగా ఉంటున్న ఆజాద్ సడెన్ గా రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బహుషా ఆయన బీజేపీలో చేరవచ్చని.. బీజేపీలో ఏదో ఒక పదవి ఇస్తారని అంటున్నారు. మరి ఆజాద్ అడుగులు ఎటువైపు పడుతాయన్నది వేచిచూడాలి.