Nara Chandrababu: చంద్రబాబుకి పరీక్ష పెడుతున్న కాంగ్రెస్

అమరావతి ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు.

Written By: Dharma, Updated On : December 11, 2023 11:54 am

Nara Chandrababu

Follow us on

Nara Chandrababu: తెలంగాణ గెలుపుతో కాంగ్రెస్ పార్టీ ఊపుతూ ఉంది. అదే ఊపుతో దాయాది రాష్ట్రం ఏపీలో సైతం పార్టీని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. అందుకే ఏపీలో అపరిస్కృత సమస్యలపై దృష్టి పెడుతోంది. ముఖ్యంగా విశాఖ ఉక్కు, అమరావతి పరిణామాలు పై ఫోకస్ పెట్టింది. ఇటువంటి అంశాల ద్వారా ఏపీలో కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకోవాలని చూస్తోంది. ఇందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు రంగంలోకి దిగడం విశేషం. మరీ ముఖ్యంగా చంద్రబాబును తన వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ చూస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

అమరావతి ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సమావేశానికి రావడానికి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులకు కాంగ్రెస్ హై కమాండ్ సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీని వెనుక కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా చంద్రబాబుతో పాటు బిజెపికి పరీక్ష పెట్టేందుకే కాంగ్రెస్ ఈ కొత్త ఎత్తుగడగా తెలుస్తోంది.

అమరావతి ఏకైక రాజధానికి టిడిపి తో పాటు జనసేన, బిజెపి, కాంగ్రెస్ మద్దతు తెలుపుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గట్టిగానే ఫైట్ చేస్తోంది. దీంతో అమరావతి పరిరక్షణ సమితి అమరావతి ఏకైక రాజధానికి మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ఆహ్వానాలను పంపించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వస్తే ఆ సభలో బిజెపి పాలుపంచుకుంటుందా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఒకవేళ పాల్గొనకుంటే మాత్రం అది కాంగ్రెస్ పార్టీకి ప్రచారాస్త్రంగా మారనుంది. బిజెపి వైఖరిని కాంగ్రెస్ ఎండగట్టనుంది.

అయితే ఈ సభకు కాంగ్రెస్ అధినాయకరాలు ప్రియాంక గాంధీ హాజరు కావడానికి చంద్రబాబు మరో కారణం. ఇప్పటికే చంద్రబాబు బిజెపి కోసం వెయిట్ చేస్తున్నారు. బిజెపి నుంచి సానుకూలత రాలేదు. ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపి నుంచి కూడా ఆసక్తి తగ్గింది. ఇటువంటి తరుణంలో చంద్రబాబును ఇండియా కూటమి వైపు తెస్తే.. మంచి ఫలితాలు ఉంటాయని కాంగ్రెస్ భావిస్తోంది. తద్వారా బిజెపిని దెబ్బతీయవచ్చని కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ వ్యూహంగా తేలుతోంది. అయితే ఇందులో చంద్రబాబు చిక్కుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.