Karnataka Elections 2023 : హైదరాబాద్ – కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ దే హవా.. తెలంగాణపై పెరిగిన ఆశలు..!

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజెక్కించుకుంటే మాత్రం కచ్చితంగా ఆ ఫలితం తెలంగాణపై ఉంటుందని ఆ పార్టీ నాయకులు బలంగా విశ్వసిస్తున్నారు.

Written By: NARESH, Updated On : May 10, 2023 11:03 pm

Karnataka Elections 2023

Follow us on

Karnataka Elections 2023 : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో ఎన్నికల జరుగుతుండగా పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని చెబుతున్నాయి. ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కీలక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ ఫలితాలు తెలంగాణలోను ప్రస్తుతం అయ్యే అవకాశం కనిపిస్తోందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

దేశంలో తొమ్మిదేళ్ల కిందట అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. గతంలో ఎన్నడూ లేనంతగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. అనేక రాష్ట్రాల్లో పార్టీ అంపశయ్యపై ఉంది. కొన్నిచోట్ల మాత్రం బిజెపితో పోటీగా ఢీకొడుతోంది. అటువంటి రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ వంటివి ఉన్నాయి. కర్ణాటకకు బుధవారం జరిగిన ఎన్నికల్లో అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన అధిక్యాన్ని కనబరుస్తోందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే అనూహ్యంగా కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ పుంజుకుని విజయాలు సాధించే అవకాశం ఉందని చెబుతుండడంతో తెలంగాణలోని ఆ పార్టీ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో అదే విధమైన ఫలితాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు..

ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుంది. మొత్తం 41 స్థానాలు హస్తం పార్టీకి లభిస్తాయి. ఈ రీజియన్ లో 35 స్థానాలతో బిజెపి రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. జనతాదళ్ (సెక్యులర్) 17 స్థానాలకు పరిమితం అవుతుంది. ఇతరులు ఏడు స్థానాలను దక్కించుకుంటారు. కరావలి కర్ణాటక అంటే కోస్తా రీజియన్ లో కూడా కాంగ్రెస్ దే ఆధిపత్యం. ఈ రీజియన్ లో కాంగ్రెస్ కు 17 సీట్లు లభిస్తాయి. బిజెపి 10, జెడిఎస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంటాయి. బెంగుళూరు పరిధిలోను కాంగ్రెస్ దే హవా అని ఈ ఎగ్జిట్ పోల్ సర్వే చెబుతోంది. ఇక్కడ కాంగ్రెస్ 10, బిజెపి పది స్థానాలను దక్కించుకుంటాయి. హైదరాబాద్ కర్ణాటక అంటే కళ్యాణ కర్ణాటక రీజియన్ పరిధిలో కాంగ్రెస్ క్లీన్ స్వీట్ చేస్తుందని ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎక్కడ కాంగ్రెస్ కు 32, బిజెపికి ఏడు, జెడిఎస్ కు మూడు స్థానాలు వస్తాయి.

తెలంగాణ పార్టీ నాయకుల్లో చిగురుస్తున్న ఆశలు..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన స్థానాలు సాధించే అవకాశం ఉండడంతో తెలంగాణలోని ఆ పార్టీ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్ – కర్ణాటక రీజియన్ లో కాంగ్రెస్ పార్టీ హవా ఉండడంతో.. ఈ ఫలితం వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బలంగా ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో జోరుగా ప్రజల్లోకి వెళ్తోంది. ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజెక్కించుకుంటే మాత్రం కచ్చితంగా ఆ ఫలితం తెలంగాణపై ఉంటుందని ఆ పార్టీ నాయకులు బలంగా విశ్వసిస్తున్నారు. చూడాలి మరి కొద్ది రోజుల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి తీర్పును ఇవ్వబోతున్నారో.