Homeజాతీయ వార్తలుWomen Reservation Bill India: కాంగ్రెస్‌ను భయపెట్టిన డీలిమిటేషన్‌.. బిల్లును వ్యతిరేకించడం వెనుక పెద్ద స్ట్రాటజీ!

Women Reservation Bill India: కాంగ్రెస్‌ను భయపెట్టిన డీలిమిటేషన్‌.. బిల్లును వ్యతిరేకించడం వెనుక పెద్ద స్ట్రాటజీ!

Women Reservation Bill India: దాదాపు 50 ఏళ్ల తర్వాత లోక్‌సభ సీట్లు పెంచేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఓ ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఉన్న 543 సీట్లు 1977లో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసినవే. తాజాగా 130వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ స్థానాలు 816కు పెంచడంతోపాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈమేరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టింది. అయితే ఈ బిల్లే కాంగ్రెస్‌ను భయపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందితే కాంగ్రెస్‌ భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతుంది. ఉనికే లేకుండా పోతుంది. అందుకే కాంగ్రెస్‌ విపక్షాలను ఏకం చేసి బిల్లును వ్యతిరేకించడంలో విజయవంతమైంది.

కాంగ్రెస్‌ పునర్విభజనలు
కాంగ్రెస్‌ 50 ఏళ్ల పాలనలో తమ అనుకూలంగా సీట్లను ఒకటిగా, వ్యతిరేక సీట్లలో ఓటర్లను విభజించి అనుకూల నియోజకవర్గాల్లో కలపడం వంటివి చేసింది. తెలంగాణలో 2008–09 పునర్విభజనలో హైదరాబాద్‌ హిందూ ఓటర్లను ముస్లిం బలమైన పాత్‌బస్తీ ప్రాంతాలతో కలిపి బీఆర్‌ఎస్, బీజేపీ ఓట్లు చీలేలా చేశారు. 90 కి.మీ. దూరంలోని తాండూర్‌ను హైదరాబాద్‌ లోక్‌సభ సీటుకు చేర్చి ముస్లిం ఓట్లు బలోపేతం చేశారు. పశ్చిమ బెంగాల్, కేరళలో ముస్లిం, క్రిస్టియన్‌ ప్రాంతాల సీట్లు పెంచి, హిందూ బలమైన దక్షిణ కేరళలో సీట్లు తగ్గించారు. శ్రీరంగంలో బ్రాహ్మణులు గెలవకుండా విభజనలు చేశారని విమర్శలు వచ్చాయి.

ఎన్డీఏ బిల్లు వివరాలు
కేంద్రం మూడు బిల్లులు ప్రవేశపెట్టింది. డీలిమిటేషన్‌ బిల్లు–2026, మహిళా రిజర్వేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సీట్ల పెంపు. లోక్‌సభ సీట్లు 50 శాతం పెంచి 816–850కి, రాష్ట్రాలకు 815, యూటీలకు 35 సీట్లు కేటాయించాలని ప్రతిపాదన. జూన్‌లో డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటు, 84వ సవరణను సవరించి 2011 డేటాతో ముందుకు సాగాలని భావించింది. ఉత్తరప్రదేశ్‌కు 120 సీట్లు, తెలంగాణకు 25, ఏపీకు 38 సీట్లు పెరిగే అవకాశం. షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు సీట్లు పెరుగుతాయని కేంద్రం చెబుతోంది.

ప్రాంతీయ ప్రభావాలు
తెలంగాణ, తమిళనాడు సీఎంలు దక్షిణ రాష్ట్రాల సమతౌల్యం దెబ్బతింటుందని వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎంపీ సీట్ల మార్పు ఎమ్మెల్యే సీట్లను కూడా ప్రభావితం చేస్తుంది. ఉత్తర రాష్ట్రాల జనాభా ఆధారంగా సీట్లు పెరిగి దక్షిణానికి నష్టం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

రాజకీయ వివాదం
ఇండియా కూటమి, మల్లికార్జున్‌ ఖర్గే దీన్ని రాజ్యాంగ విరుద్ధ కుట్రగా, బీజేపీ హైజాక్‌ ప్రయత్నంగా విమర్శిస్తోంది. కేసీ వేణుగోపాల్‌ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఇది జన హితమని, కాంగ్రెస్‌ గతంలో జనాభా ఆధారం మర్చినట్టు ఆరోపిస్తోంది.

ఈ పునర్విభజన దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చనుంది. కాంగ్రెస్‌ తన ’కంచుకోటలు’ కుప్పకూలుతాయని భయపడుతోంది. బీజేపీ మతపరమైన పోలరైజేషన్‌కు అనుకూలంగా మారవచ్చని ఆరోపణలు ఉన్నాయి. భవిష్యత్‌ ఎన్నికల్లో పార్టీల బలాలు పూర్తిగా మారే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular