బ్యాంకు రుణాల రద్దుపై ఆత్మరక్షణలో మోదీ ప్రభుత్వం

ఆర్ టి ఐ దరఖాస్తుకు సమాధానంగా రిజర్వు బ్యాంకు వెల్లడించిన బ్యాంకులు రద్దు చేసిన మొదటి 50 మంది జాబితా వెలుగులోకి రావడంతో మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. కేవలం సాంకేతికంగా బ్యాంకులు రద్దు చేశాయి గాని, వారి రుణాలు రద్దు చేసిన్నట్లు కాదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన వివరణ విమర్శకులకు తగు సమాధానం చెప్పలేక పోతున్నది. సహజంగానే ఈ పరిణామం కాంగ్రెస్ నేతలకు చక్కటి అవకాశం ఇచ్చిన్నట్లు అవుతున్నప్పటికీ, బిజెపి మద్దతు […]

Written By: Neelambaram, Updated On : April 30, 2020 6:02 pm
Follow us on


ఆర్ టి ఐ దరఖాస్తుకు సమాధానంగా రిజర్వు బ్యాంకు వెల్లడించిన బ్యాంకులు రద్దు చేసిన మొదటి 50 మంది జాబితా వెలుగులోకి రావడంతో మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది.

కేవలం సాంకేతికంగా బ్యాంకులు రద్దు చేశాయి గాని, వారి రుణాలు రద్దు చేసిన్నట్లు కాదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన వివరణ విమర్శకులకు తగు సమాధానం చెప్పలేక పోతున్నది.

సహజంగానే ఈ పరిణామం కాంగ్రెస్ నేతలకు చక్కటి అవకాశం ఇచ్చిన్నట్లు అవుతున్నప్పటికీ, బిజెపి మద్దతు దారులను సహితం గందరగోళంలో పడవేస్తున్నది.

కేంద్రం తీరుపై ఫైర్ అవుతున్న మంత్రి తలసాని

ఇవ్వన్నీ యుపిఎ హయాంలో ఇచ్చిన రుణాలన్నీ, అప్పుడే ఎగవేసే వారికి ఇచ్చారని అంటూ సీతారామన్ చేస్తున్న వాదనలకు బలమైన ఆధారాలు లభించడం లేదు.

బ్యాంకు ఉద్యోగుల సంఘ నాయకుల వాదనల ప్రకారం 2014 నాటికి బ్యాంకుల మొండి బకాయిలు రూ 2.5 లక్షలు మాత్రమే కాగా, గత ఆరేళ్లలో మూడు, నాలుగు రేట్లు పెరిగింది.

పైగా గతంలో ఎన్నడూ లేని విధంగా కీలకమైన ఎగవేత దారులు విదేశాలకు పారిపోయారు. వారిని స్వదేశానికి రప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం చెడుబుతున్నా ఇప్పటి వరకు చెప్పుకోదగిన ఫలితం చూపలేక పోతున్నారు.

మత సామరస్యం సాధ్యమేనా?

బీజేపీ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికైన సమయంలో విదేశాలకు పారిపోయే ముందు విజయ్ మాలవ్య ఇద్దరు కీలకమైన కేంద్ర మంత్రులను కలిసి వెళ్లడం గమనార్హం.

బ్యాంకురుణాలు ఎగవేసి విదేశాలకు పరారైన వారి రుణాలను సాంకేతిక కారణాలతో రద్దు చేయాలని ఎందుకు నిర్ణయించారని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పి. చిదంబరం ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నిలదీశారు.

ఈ సందర్భంగా, వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌, మోదీ హయాంలో రుణాల ఎగవేతదారుల జాబితాను వేర్వేరుగా వెల్లడించాలని తాను పార్లమెంట్‌లో కోరితే ప్రభుత్వం జవాబివ్వలేదని చిదంబరం తెలిపారు.

రుణాలను సాంకేతిక కారణాలపై మాఫీ చేసే నిబంధనను నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ, విజయ్‌ మాల్యాలకు ఎలా వర్తింపచేస్తారని ఆయన ప్రశ్నించారు.