Conflicts in Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేధాలు ఇంకా సమసిపోలేదు. అవి అలాగే ఉన్నాయి. దీంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంలో పడుతోంది. వచ్చే నెలలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వరంగల్ జిల్లాలో పర్యటించేందుకు సమయం ఇచ్చారు. దీంతో పార్టీ నేతలు అక్కడ రైతు సంఘర్షణ నిర్వహించి ప్రజల్లో పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా జనసమీకరణ చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను నల్గొండలోనూ సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. కానీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో పార్టీ బలంగా ఉందని ఇక్కడ నిర్వహించాల్సిన అవసరం లేదని చెబుుతన్నారు దీంతో కాంగ్రెస్ నేతల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇలాగైతే పార్టీ బతికి బట్టకట్టడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇన్నాళ్లు అలకబూనిన స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చారు. దీంతో ఆయన చల్లబడి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారని భావించారు. కానీ కథ మళ్లీ మొదటికే వచ్చింది. తన జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు పర్యటించాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి వాదిస్తున్నారు. దీనికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడికి ఏ జిల్లాలో అయినా పర్యటించే హక్కు ఉంటుందని చెబుతున్నారు. అయితే దీనిపై మధుయాష్కీ గౌడ్ సైతం బలహీనంగా ఉన్న జిల్లాల్లో పర్యటించాలని సూచనలు చేస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ లో పార్టీ బలహీనంగా ఉన్నందున అక్కడ పర్యటనలు చేయాలని హితవు పలుకుతున్నారు.
Also Read: Jagan Govts Borrowings: అప్పుల కోసం తిప్పలు.. కేంద్రం అనుమతి కోసం జగన్ సర్కారు పడిగాపులు
ఇదివరకే రాహుల్ గాంధీ అందరిని పిలిచి ఢిల్లీలో సమావేశం నిర్వహించి విభేదాలు పక్కన పెట్టాలని సూచించినా వారిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇలాగైతే పార్టీ బలోపేతం కావడం అటుంచితే ప్రజల్లో సానుభూతి సైతం రాకుండా పోతోందనే ప్రశ్నలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ చెప్పినా నేతల్లో మార్పు రాలేదంటే ఇక అంతే సంగతి అనే అభిప్రాయాలు అందరిలో వస్తున్నాయి. దీంతో పార్టీ భవితవ్యం మరోమారు ప్రశ్నార్థకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
రేవంత్ రెడ్డి నల్గొండకు రావద్దనేది కోమటిరెడ్డి వాదన. తెలంగాణలో పార్టీని ముందుకు నడిపించాలంటే అందరి సహకారం అవసరమే. కానీ ఇలా విభేదాలు మనసులో పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహించకుండా చేస్తే పార్టీ ఎలా ప్రజల్లోకి వెళ్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ప్రజల్లోకి వెళ్లడం కష్టంగానే కనిపిస్తోంది. నేతల్లో అంతర్గతంగా ఉన్న అభిప్రాయాల కారణంగా పార్టీ ముందుకు వెళ్లే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఈ క్రమంలో రాహుల్ గాంధీతో కూడా రాష్ట్ర కాంగ్రెస్ ను గాడిలో పెట్టే పని కావడం లేదంటే వారిలో ఎంతగా విభేదాలు ఉన్నాయో అర్థమవుతోంది.
మరోవైపు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతున్న క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంలో పడనుంది. ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి వెళితే పార్టీ ప్రజల్లో పట్టు నిలుపుకోవడం కష్టమే. దీనిపై అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత కుమ్ములాటలకు ఇంకా స్వస్తి పలకలేదనే తెలుస్తోంది.
Also Read: Analysis on YCP vs Janasena : జనసేనతో పెట్టుకుంటే అంతేమరీ