Jagan and Sharmila: దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల వైఎస్‌ఆర్ టీపీ పేరిట పొలిటికల్ పార్టీ స్థాపించి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, తన అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న విభేదాల వలనే ఆమె తెలంగాణలో పార్టీ స్థాపించిందని పలువురు ఆరోపించారు. కాగా, తాజాగా అన్న జగన్‌తో చెల్లెలు షర్మిలకు ఉన్న గొడవల గురించి ఓ ప్రముఖ తెలుగు దిన పత్రిక ఎండీ తన కథనంలో రాశారు. ఆ విషయాలు ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా అన్నా చెల్లెల మధ్య ఆస్తి విషయమై గొడవ జరిగిందని గతంలో కథనం ప్రచురించిన ఓ ప్రముఖ తెలుగు దిన పత్రిక ఎండీ తాజాగా మరికొన్ని విషయాలపై స్టోరి రాశారు. ఆయన రాసిన స్టోరి ప్రకారం.. అన్న జగన్మోహన్‌రెడ్డితో చెల్లెలు షర్మిలకు విభేదాలున్నాయని స్పష్టమవుతోంది. ఇకపోతే ఈ స్టోరిపైన వైసీపీ అధినేత జగన్ వర్గీయులు కాని వైఎస్ ఆర్ టీపీ అధినేత్రి షర్మి ల వర్గీయులు కాని స్పందించలేదు.
Also Read: వినోదంపైనే గురి.. జగన్ సినిమాను ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు?
మొత్తంగా ఆస్తుల వ్యవహారంతో పాటు రాజకీయ పరమైన అంశాలపైన కూడా తన సోదరుడు జగన్మోహన్ రెడ్డితో షర్మిల ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం కోసం తన వంతుగా ప్రచారం చేసిన తనకు తెలంగాణలో రాజకీయంగా బలపడకుండా జగన్ అడ్డు తగులుతున్నాడని షర్మిల ఫైర్ అయినట్లు సమాచారం. తెలంగాణలోని ముఖ్య నాయకులను తన పార్టీలోకి రాకుండా జగన్ అడ్డుకున్నట్లు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తోందట.
షర్మిల ఈ క్రమంలోనే తన సోదరుడు జగన్మోహన్ రెడ్డికి శాపనార్థాలు ఈ విధంగా పెట్టిందట. తనకు అన్యాయం చేస్తే దేవుడు నష్టం చేస్తాడని, పోగు చేసుకున్న సంపదనంత దక్కకుండా చేస్తాడని జగన్‌ను ఉద్దేశించి షర్మిల కామెంట్స్ చేసిందని కథనంలో పేర్కొన్నారు. ఇక తెలంగాణలో తనను బలపడకుండా అడ్డుకుంటున్నంకుగాను తాను ఏపీలో రాజకీయంగా జగన్ పార్టీని బలహీనపరుస్తానని షర్మిల హెచ్చరించినట్లు సమాచారం.
Also Read: హైదరాబాద్ ఫ్లై ఓవర్‌ను వాడుకోవద్దు.. బీజేపీ నేతల గూబ గుయ్యిమనిపించిన కేటీఆర్