https://oktelugu.com/

Unstoppable with NBK: బాలయ్య అడుక్కోవడం ఏమిటి ? ఆర్డర్ వేయాలి గానీ..

Unstoppable with NBK: బాలయ్య నోరు తెరిచి ఎన్నడూ ఎవర్నీ సినిమా చేయమని అడగరు. ఇండస్ట్రీలో బాలయ్యకి ఉన్న పేరు ఇది. కానీ, ఎందుకో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోలో మాత్రం “నాతో సినిమా ఎప్పుడు ?’ ‘మన కాంబినేషన్ ఇంతవరకు పడలేదు కదా’, ‘మనం ఒక సినిమా ప్లాన్ చేద్దాం’ ఇలా ఈ టాక్ షోలో బాలయ్య అందర్నీ ఇన్ డైరెక్ట్ గా సినిమా చేయమని అడుగుతూనే ఉన్నాడు. బాలయ్య నిస్సందేహంగా పెద్ద హీరోనే. పైగా […]

Written By:
  • Shiva
  • , Updated On : January 2, 2022 6:14 pm
    Follow us on

    Unstoppable with NBK: బాలయ్య నోరు తెరిచి ఎన్నడూ ఎవర్నీ సినిమా చేయమని అడగరు. ఇండస్ట్రీలో బాలయ్యకి ఉన్న పేరు ఇది. కానీ, ఎందుకో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోలో మాత్రం “నాతో సినిమా ఎప్పుడు ?’ ‘మన కాంబినేషన్ ఇంతవరకు పడలేదు కదా’, ‘మనం ఒక సినిమా ప్లాన్ చేద్దాం’ ఇలా ఈ టాక్ షోలో బాలయ్య అందర్నీ ఇన్ డైరెక్ట్ గా సినిమా చేయమని అడుగుతూనే ఉన్నాడు. బాలయ్య నిస్సందేహంగా పెద్ద హీరోనే.

    Unstoppable with NBK

    Unstoppable with NBK

    పైగా సీనియర్ హీరో కూడా. అన్నిటికి మించి బాలయ్య భోళా మనిషి. ఏదో ఆశించి ఏదో మాట్లాడే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి కాబట్టే.. ఈ షో సూపర్ హిట్ అయింది. దాన్ని బాగా వాడుకున్నారు సదరు సంస్థవారు. బాలయ్య చేత నాతో సినిమా చేయండి అనే డైలాగ్ ను కామన్ గా చెప్పిస్తున్నారు. ఈ షోకి స్క్రిప్ట్ ను అందిస్తోంది రచయిత మచ్చ రవి. మరి రవి ప్లాన్ చేసున్నాడో, లేక.. బాలయ్యే ఇలా అందర్నీ అడిగేస్తున్నాడో అర్ధం కావడం లేదు.

    Also Read:  నార్త్‌లోనూ ‘తగ్గేదేలే’.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘పుష్ప’ రాజ్..

    షోను రక్తి కట్టించడం కోసం బాలయ్య ఇలా అడుగుతున్నాడని నందమూరి ఫ్యాన్స్ కూడా సర్దిచెప్పుకోవాల్సి వస్తోంది. ‘అసలు బాలయ్య అడుక్కోవడం ఏమిటి ? ఆర్డర్ వేయాలి గానీ’ అని బాలయ్య ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఎవరి బాధ వాళ్ళది. బాలయ్యకి ఈ మధ్య ఒక విషయం బాగా అర్ధమైంది. తనతో మంచి డైరెక్టర్ గాని సినిమా చేస్తే.. ఆ సినిమాకి మంచి మార్కెట్ క్రియేట్ అవుతుంది.

    అలాగే ఆ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి. అందుకే, బాలయ్య తనకు అలావాటు లేని పనిని చాలా సింపుల్ చేసేస్తున్నాడు. అయితే, దర్శకుల్ని ఇన్నాళ్లూ సినిమా చేయమని అడిగాడు, సర్లే బాలయ్య ఏదో ముచ్చట పడుతున్నాడు అని సర్దుకుపోయారు అభిమానులు. కానీ, చివరకు హీరో రవితేజను కూడా తనను డైరెక్ట్ చేయమని, నీ డైరెక్షన్ లో నేను యాక్ట్ చేస్తాను అంటూ మొత్తానికి తన కోరికను మరోసారి బాలయ్య బయట పెట్టాడు.

    ఏది అయితే ఏం బాలయ్య డైలాగ్ విని రవితేజ కూడా షాక్ అయ్యాడు. బాలయ్య తనకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా అనే సరికి రవితేజ కూడా కాస్త లోలోపల తెగ సంతోషపడినట్టు కనిపించాడు. పైగా నీలో మంచి దర్శకుడు కూడా ఉన్నాడంటగా అంటూ బాలయ్య రవితేజలోని డైరెక్టర్ ను కూడా నిద్ర లేపాడు.

    Also Read: ‘అఖండ’ థియేటర్ బిజినెస్ క్లోజ్.. మొత్తం కలెక్షన్స్ ఎంతంటే ?

    Tags