Sahara Scam: కోట్ల డబ్బులు డిపాజిట్‌.. ఇచ్చేవారు లేరు.. సుప్రీం కోర్టు చెప్పినా.. సర్కార్‌ మీనమేషాలు.. సహారా బాధితుల గోడు పట్టేదెవరికి?

సహారా ఇండియా చాలాకాలంగా దివాళా తీసింది. నిబంధనల ఉల్లంఘన, మోసం కేసులు సంస్థపై నమోదయ్యాయి. దీంతో చైర్మన్‌ సుభ్రతోరాయ్‌ చాలాకాలం జైల్లో ఉన్నారు. డిపాజిటర్లకు నిధులు చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఇందు సంబంధించిన నిధులు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.

Written By: Raj Shekar, Updated On : July 24, 2024 12:58 pm

Sahara Scam

Follow us on

Sahara Scam: సహారా ఇండియా.. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ప్రధాన కార్యాలయం. గ్రూప్‌ ఫైనాన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, రియల్‌ ఎస్టేట్, స్పోర్ట్స్, పవర్, మాన్యుఫ్యాక్చరింగ్, మీడియా – ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్‌ కేర్, లైఫ్‌ ఇన్సూరెన్స్, ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్, ఆఫ్‌లైన్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్, రిటైల్, ఈ–కామర్స్‌ (ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ షాపింగ్‌), ఎలక్ట్రికల్‌ వెహికల్‌ (సహారా ఎవాల్స్‌), హాస్పిటల్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, హాస్పిటాలిటీ మరియు కో–ఆపరేటివ్‌ సొసైటీ. ఈ బృందం భారతదేశంలో క్రీడలకు ప్రధాన ప్రమోటర్‌గా ఉంది మరియు అనేక ఇతర క్రీడలతోపాటు భారత జాతీయ క్రికెట్‌ జట్టు, భారత జాతీయ హాకీ జట్టు మరియు బంగ్లాదేశ్‌ జాతీయ క్రికెట్‌ జట్టు, ఫోర్స్‌ ఇండియా ఫార్ములా వన్‌ జట్టు టైటిల్‌ స్పాన్సర్‌గా ఉంది.

సహారా ఇండియా చాలాకాలంగా దివాళా తీసింది. నిబంధనల ఉల్లంఘన, మోసం కేసులు సంస్థపై నమోదయ్యాయి. దీంతో చైర్మన్‌ సుభ్రతోరాయ్‌ చాలాకాలం జైల్లో ఉన్నారు. డిపాజిటర్లకు నిధులు చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఇందు సంబంధించిన నిధులు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. నిధుల సమీకరణలో ఉండగానే సుభ్రతోరాయ్‌ మరణించారు. దీంతో డిపాజిటర్లకు చెల్లింపుల బాధ్యతను సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. కానీ, డిపాజిట్ల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంతో దేశవ్యాప్తంగా డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన బాధితులు పెద్ద సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు. తమ డిపాజిట్‌ సొమ్ము తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ‘ఆలిండియా జనాందోళన్‌ సంఘర్‌‡్ష న్యాయ మోర్చా’ బాధితులకు అండగా నిలిచి ఈ ఆందోళనలో భాగమైంది. బాధితుల డిపాజిట్ల సొమ్ము తిరిగి చెల్లించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో రిఫండ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేసినప్పటికీ, చాలా మంది బాధితులకు చెల్లింపులు జరగలేదు.

Sahara Scam

రూ.30 డిపాజిట్లు చెల్లించాలని..
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర కేంద్ర హోంశాఖ ద్వారా ఏర్పాటైన రిఫండ్‌ పోర్టల్‌ ద్వారా రూ. 30 వేల వరకు డిపాజిట్‌ చేసిన 2.5 కోట్ల మంది డిపాజిటర్లకు సొమ్ము తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం సెబీ వద్ద సహారా గ్రూప్‌ డిపాజిట్‌ చేసిన రూ. 24,979 కోట్ల నుంచి రూ. 5 వేల కోట్లను డిపాజిటర్లకు తిరిగి చెల్లించేందుకు వినియోగించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రిఫండ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేసినప్పటికీ.. కోట్ల సంఖ్యలో ఉన్న డిపాజిటర్లలో కొందరికి మాత్రమే సొమ్ము తిరిగి అందింది. మిగతా బాధితులు తమకు కూడా తమ డిపాజిట్ల సొమ్ము త్వరగా తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

చైర్మన్‌ మరణం తర్వాత డిపాజిట్‌ దారుల్లో ఆందోళన..
సహారా గ్రూపు చైర్మన్‌ సుభ్రతా రాయ్‌ మరణించడంతో డిపాజిటర్లలో ఆందోళన మరింత పెరిగింది. సహారా గ్రూప్‌ చీఫ్‌ సుబ్రతా రాయ్‌ 2023లో మరణించారు. ఆతర్వాత డిపాజిట్ల చెల్లింపు ప్రక్రియ దాదాపు ఆగిపోయింది. వాస్తవానికి, 2011 లో, క్యాపిటల్‌ మార్కెట్‌ రెగ్యులేటర్, సెబీ, సహారా గ్రూప్‌ యొక్క రెండు కంపెనీలు, సహారా ఇండియా రియా కార్పొరేషన్‌ లిమిటెడ్, టెరా హౌసింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 3 కోట్ల పెట్టుబడిదారుల డబ్బులు తిరిగి ఇవ్వమని ఆదేశించింది. నిబంధనలు, చట్టాలను ఉల్లంఘిస్తూ రెండు కంపెనీలు ఈ డబ్బును సేకరించాయని సెబీ తెలిపింది. దీంతో 15 శాతం వడ్డీతో డబ్బు, న్యాయ పోరాటం తరువాత, సహారా గ్రూప్‌ ఒక బ్యాంకులో రూ .20,000 కోట్లకు పైగా జమ చేసింది, ఇది ఇప్పుడు రూ.25 వేల కోట్లకు పైగా పెరిగింది. డబ్బులు తిరిది చెల్లించేందుకు 2023 జూలై 18న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సెంట్రల్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ సహరా వాపసు పోర్టల్‌ను ప్రారంభించారు. సహారా గ్రూప్‌ సొసైటీల యొక్క నిజమైన, చట్టబద్ధమైన డిపాజిటర్లు మాత్రమే సహారా వాపసు పోర్టల్‌ ద్వారా వాపసు పొందటానికి అర్హులు. కానీ, చాలా మందికి డిపాజిట్లు అందడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో సహారా బాధితులు
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2.80 కోట్ల మంది సహారా బాధితులు ఉన్నారు. కుటుంబ అవసరాల కోసం సహారాలో దాచుకున్నారు. సుభ్రతారాయ్‌ మరణం తర్వాత వీరిలోనూ ఆందోలన నెలకొంది. డిపాజిట్ల రిటర్న్‌ కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నా తిరిగి ఇవ్వడం లేదని పలువురు రోడ్డెక్కుతున్నారు. ఎవరిని సంప్రదించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. డిపాజిట్లు వస్తాయా, వస్తే ఎప్పుడు ఇస్తారో తెలియక కలవరపడుతున్నారు.