YS Jagan: రాజకీయాల్లో ప్రతీకారాలు అనేవి చాలా కామన్ గా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం చేసే వాటిని గుర్తుప ఎట్టుకుని మరీ.. అధికారంలోకి వచ్చాక చేయడం అనేది కామన్. ఇలాంటి ప్రతీకార రాజకీయాలు ఏపీలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా ఇలాంటి పనే చేస్తోంది. దీంతో ఫిర్యాదుల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో వైసీపీ చవి చూస్తోంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఇలాగే ఫిర్యాదులు చేసేది.
కేంద్రం నిధులు తప్పుదారి పడుతున్నాయంటూ గతంలో వైసీపీ చేసిన ఫిర్యాదులతో కేంద్రం నిధులను ఎక్కడికక్కడ ఆపేసేది. దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇబ్బందులు పడింది. ఇప్పుడు టీడీపీ కూడా ఇలాగే అనేక అంశాలపై ఫిర్యాదులు చేస్తోంది. దీంతో కేంద్రం నిధుల మంజూరు చేయడం లేదు. మొన్నటికి మొన్న రాజధాని భూముల్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలనుకుంది ప్రభుత్వం. ఈ క్రమంలో హడ్కోకు రిజిస్ట్రేషన్ చేయించింది. కానీ రఘురామ ఫిర్యాదుతో ఆ పని ఆగిపోయింది.
Also Read: CM Jagan: టాలీవుడ్ విశాఖకు రావాల్సిందే.. జగన్ కోరిక అదే
ఇక ఉపాధి హామీ పనులతో సెంట్ ఇళ్ల స్థలాల పనులు చేయించాలని వైసీపీ అనుకుంది. కానీ ఫిర్యాదుల కారణంగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. వైసీపీ ఎంపీలు ఏ కేంద్ర మంత్రి వద్దకు వెళ్లినా.. అక్కడ టీడీపీ పెట్టిన ఫిర్యాదులు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ ఎంపీలు కూడా ఏమీ అనలేకపోతున్నారు. వాటిపై విచారణ జరిపించిన తర్వాతే నిధులు మంజూరు చేస్తామని కేంద్రం చెబుతోంది. దీంతో ఏపీలో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి జగన్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
దీంతో తాము చూపిన దారిలోనే టీడీపీ నడుస్తోందన్న మాటలను గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. ఇక ఇప్పుడు వైసీపీ అసహనం మీద టీడీపీ నేతలు చాలా సెటైర్లు వేస్తున్నారు. సీన్ రివర్స్ అయింది అంటూ గుర్తు చేస్తున్నారంట. ఏదేమైనా గతంలో జగన్ చేసిన చాలా పనులను ఇప్పుడు టీడీపీ గుర్తు పెట్టుకుని మరీ చేయడం గమనార్హం.
Also Read: CM Jagan: జగన్ ఇది నీకు తగునా? ప్రజలకు మూడు గంటల నరకం భావ్యమా?