‘ఎమ్మెల్సీ’ కోసం కాంగ్రెస్ లో పోటాపోటీ..రేసులో వీరే? 

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి షూరు అయింది. శాసన మండలిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ పదవీకాలం ఇటీవలే ముగిసింది. వీరితోపాటు ఎమ్మెల్సీ రాములు నాయక్ ఎన్నికలకు సమయంలో టీఆర్ఎస్ ను వీడటంతో ఆయనపై అనర్హత వేటుపడింది. దీంతో ఈ మూడు స్థానాలకు దీంతో త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆశావహులు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి పోటీపడుతున్నారు. Also Read: కేసీఆర్ కు […]

Written By: NARESH, Updated On : September 20, 2020 1:03 pm
Follow us on

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి షూరు అయింది. శాసన మండలిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ పదవీకాలం ఇటీవలే ముగిసింది. వీరితోపాటు ఎమ్మెల్సీ రాములు నాయక్ ఎన్నికలకు సమయంలో టీఆర్ఎస్ ను వీడటంతో ఆయనపై అనర్హత వేటుపడింది. దీంతో ఈ మూడు స్థానాలకు దీంతో త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆశావహులు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి పోటీపడుతున్నారు.

Also Read: కేసీఆర్ కు సెల్ఫీ వీడియో.. నిరుద్యోగుల ఉసురుబోసుకుంటున్నారా?

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ పదవీని ఆశిస్తున్న ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ రెండు పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారింది. టీఆర్ఎస్ కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ కానుంది. కాగా టీఆర్ఎస్ లో సీనియర్ నేతగా ఉన్న నాయిని నర్సింహారెడ్డికి ఈసారి ఎమ్మెల్సీ పదవీ దక్కుతుందా? లేదా అనే ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్ మాజీ ఎంపీ, కేసీఆర్ కూతురు కవిత పేరు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ లోనూ ఎమ్మెల్సీ కోసం పోటీ భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ సర్కారుపై ఇటీవల ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుండటంతో కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగింది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని నేతలు భావిస్తూ పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్ పట్టభద్రుల సీటు కోసం కాంగ్రెస్ పోటీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఏఐసీసీ ప్రతినిధులుగా ఉన్న నేతలే ఎమ్మెల్సీ స్థానం పోటీపడుతుండటం గమనార్హం.

Also Read: కార్పొరేట్ శక్తులకు అంతలా వణికిపోతున్నారెందుకు?

తెలంగాణ నుంచి మధుయాష్కీ గౌడ్‌.. చిన్నారెడ్డి.. సంపత్‌కుమార్‌.. వంశీచంద్‌రెడ్డి ఏఐసీసీ కార్యదర్శులుగా ఉన్నారు. వీరిలో చిన్నారెడ్డి, సంపత్‌, వంశీచంద్‌ శనివారమే హైదరాబాద్‌ పట్టభద్రుల స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు ఏఐసీసీ ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వరంగల్, ఖమ్మం, నల్లొండ ఎమ్మెల్సీ కోసం టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి.. టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి పోటీపడుతున్నారు.

 
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీకే కాంగ్రెస్ లో పోటీ తీవ్రంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీని ఆశిస్తున్న నేతలంతా ఇక్కడ పోటీ చేసేందుకు పోటీపడుతున్నారు. అయితే అధిష్టానం ఎవరినీ ఎంపిక చేస్తుందోనని టెన్షన్ అభ్యర్థుల్లో నెలకొంది.