https://oktelugu.com/

టీఆర్ఎస్ కు కామ్రేడ్స్ లాల్ సలాం..

నాగార్జునసాగర్ ఉపపోరు ఊపందుకుంది. అన్ని పార్టీల ముఖ్యనేతలంతా అక్కడే మకాం వేశారు. ఢిల్లీ నుంచి గల్లీస్థాయి లీడర్ల వరకు ప్రచారంలో తలమునకలయ్యా రు. తమపార్టీకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలో దింపుతుండగా.. అంతగా ప్రభావంలేని పార్టీలు ప్రధాన పార్టీలకు అండగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాగర్ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుతం ఆ పార్టీలు బరిలో లేవు. దీంతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 12, 2021 / 12:55 PM IST
    Follow us on


    నాగార్జునసాగర్ ఉపపోరు ఊపందుకుంది. అన్ని పార్టీల ముఖ్యనేతలంతా అక్కడే మకాం వేశారు. ఢిల్లీ నుంచి గల్లీస్థాయి లీడర్ల వరకు ప్రచారంలో తలమునకలయ్యా రు. తమపార్టీకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలో దింపుతుండగా.. అంతగా ప్రభావంలేని పార్టీలు ప్రధాన పార్టీలకు అండగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాగర్ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుతం ఆ పార్టీలు బరిలో లేవు. దీంతో వారి మద్దతు తీసుకుంటే ప్లస్ పాయింట్ అవుతుందని కాంగ్రెస్, టీఆర్ఎస్ భావిస్తున్నాయి.

    టీఆర్ఎస్ కన్నా ముందుగా.. కాంగ్రెస్ నేత ఉత్తమ్ ఆ పార్టీ కార్యదర్శులకు లేఖ రాశారు. మద్దతు ఇవ్వాలని కోరారు. ఆ లేఖపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సమచారం ఇచ్చినా.. ఇప్పటివరకు స్పందన లేదు. టీఆర్ఎస్ పార్టీ సైతం కమ్యూనిస్టుల మద్దతుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో ఎవరూ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. చివరికి మధ్యేమార్గంగా అధికారికంగా ప్రకటించకుండా.. లోపాయికారీగా టీఆర్ఎస్ కే మద్దతు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల సానుభూతిపరులు దాదాపు పదివేల మందివరకు ఉంటారు.

    కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలకు విధేయత ఎక్కువ. పార్టీ ఎవరిని సమర్థించమంటే.. వారికే జై కొడతారు. అందుకే ఎక్కడ పోటీచేసినా.. వారి ఓటు బ్యాంకు వారికి ఉంటుంది. ఇప్పుడు సాగర్ ఓటు బ్యాంకు విషయంలోనూ ఎవరికో ఒకరికి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. గతంలో చాలాకాలం పాటు కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వలేదు.

    అయితే కమ్యూనిస్టుల రాష్ట్ర నాయకత్వానికి హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంగా మాత్రం ప్రగతిభవన్ కు పిలిచి.. భోజనం పెట్టి.. బయటివరకు తీసుకొచ్చి వీడ్కోలు చెప్పి వెళ్లారు. అవసరానికి మించి ఆదరణ చూపిస్తుండడంతో కమ్యూనిస్టులు కూడా కరిగిపోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతిచ్చి కేసీఆర్ కు కోపం తెప్పించడం కన్నా… అధికారికంగా ప్రకటించకపోవడం… లోపాయికారీగా టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం మంచిద్దన్న నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.