తిరుపతిలో క్రిస్టియన్ ను దళితుడిగా ఎలా నిలబెడుతారు?

ఏపీ సీఎం జగన్ పుట్టింది హిందూ మతంలో అయినా ఆయన తన తండ్రి వైఎస్ఆర్ తో కలిసి క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు. వీరు ఏసు ప్రభువు పుట్టిన ‘జేరుసలెం’కు ప్రతీ ఐదేళ్లకోసారి వెళ్లి వస్తుంటారు. 2019లో  ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిశాక కూడా జగన్ ఇలానే వెళ్లి వచ్చారు. కానీ సీఎంగా ఇప్పుడు అన్ని మతాలను సమదృష్టితో చూస్తున్నారు. అయితే ఏపీ సీఎం జగన్ ఒక క్రిస్టియన్ అని.. అందుకే తిరుమలలో కొన్ని అపచారాలు చేశారని […]

Written By: NARESH, Updated On : April 12, 2021 12:35 pm
Follow us on

ఏపీ సీఎం జగన్ పుట్టింది హిందూ మతంలో అయినా ఆయన తన తండ్రి వైఎస్ఆర్ తో కలిసి క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు. వీరు ఏసు ప్రభువు పుట్టిన ‘జేరుసలెం’కు ప్రతీ ఐదేళ్లకోసారి వెళ్లి వస్తుంటారు. 2019లో  ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిశాక కూడా జగన్ ఇలానే వెళ్లి వచ్చారు. కానీ సీఎంగా ఇప్పుడు అన్ని మతాలను సమదృష్టితో చూస్తున్నారు.

అయితే ఏపీ సీఎం జగన్ ఒక క్రిస్టియన్ అని.. అందుకే తిరుమలలో కొన్ని అపచారాలు చేశారని అప్పట్లో బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. అంతేకాదు.. ఏపీలో ఆలయాలపై దాడులను ఎలుగెత్తి చాటింది.

ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల వేళ కూడా అది ‘క్రిస్టియానిటీ’ వివాదం చెలరేగింది. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరుఫున పోటీచేస్తున్న దళిత వైద్యుడు గురుమూర్తి పై వివాదం రాజుకుంది. ఆయన దళితుడు కాదని.. క్రిస్టియన్ అని.. తిరుపతి ఎంపీగా పోటీచేయడానికి అనర్హుడు అని బీజేపీ ఏపీ సహ ఇన్ చార్జి సునీల్ ధియేధర్ ఆరోపిస్తున్నాడు.

ఈ మేరకు సునీల్ తాజాగా ట్వీట్ చేశాడు. తిరుపతి ఎంపీ సీటు దళితులకు కేటాయించబడింది. అయితే ఇక్కడ దళిత అభ్యర్థి కాకుండా క్రిస్టియన్ ను జగన్ ను నిలబెట్టాడని.. ఇదిగో ఆధారాలు అంటూ బీజేపీ నేత సునీల్ ధియోదర్ సంచలన ట్వీట్ చేశారు.. ఇదిగో ఫ్రూఫ్ అంటూ గురుమూర్తి చర్చిలో పాస్టర్ చేతుల మీదుగా ఆశీర్వచనాలు తీసుకుంటున్న ఫొటోలను షేర్ చేశాడు.

ఏపీ సీఎం జగన్ దళితుడిని తిరుపతి ఎంపీ సీటులో నిలబెట్టకుండా ఒక క్రిస్టియన్ ను నిలబెట్టి ఏపీ ప్రజలను మోసం చేశాడని.. ఈ విషయాన్ని తాము ప్రజల్లోకి తీసుకెళుతామని బీజేపీ నేత సునీల్ ప్రకటించారు. ఎన్నికలు ముగిశాక కూడా గురుమూర్తి మతం వివాదంపై తాము వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు. ఒక క్రిస్టియన్ అయ్యిండి దళితులకు కేటాయించిన తిరుపతి ఎంపీ సీటులో గురుమూర్తి ఎలా పోటీచేస్తాడని సునీల్ ధియేదర్ ప్రశ్నించారు.

గురుమూర్తి దళితులను మోసం చేస్తున్నాడని.. వైసీపీ రహస్య ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడుతామని సునీల్ ధియేదర్ సంచలన ట్వీట్ వేశారు. ఇదిప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.