కుప్పకూలిన వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ పోర్టల్

దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరిలోనూ కరోనా భయాలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్న పరిస్థితి నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ ముఖ్యంగా 45 ఏళ్లలోపు వారిని ఎక్కువగా కబళిస్తోంది. ప్రతి 10 మంది మరణాల్లో ఏడుగురు వరకు 35 ఏళ్ల లోపు వారేనని తెలుస్తోంది. దీంతో యువత ఎక్కువగా వ్యాక్సిన్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే 45 ఏళ్ల పైబడిన వారు అంతా వ్యాక్సిన్లు వేసుకున్నారు. వారికి ఇమ్యూనిటీ వచ్చి సేఫ్ సైడ్ లో ఉన్నారు. దీంతో ఇప్పుడు […]

Written By: NARESH, Updated On : April 28, 2021 8:35 pm
Follow us on

దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరిలోనూ కరోనా భయాలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్న పరిస్థితి నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ ముఖ్యంగా 45 ఏళ్లలోపు వారిని ఎక్కువగా కబళిస్తోంది. ప్రతి 10 మంది మరణాల్లో ఏడుగురు వరకు 35 ఏళ్ల లోపు వారేనని తెలుస్తోంది. దీంతో యువత ఎక్కువగా వ్యాక్సిన్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

ఇప్పటికే 45 ఏళ్ల పైబడిన వారు అంతా వ్యాక్సిన్లు వేసుకున్నారు. వారికి ఇమ్యూనిటీ వచ్చి సేఫ్ సైడ్ లో ఉన్నారు. దీంతో ఇప్పుడు 45 ఏళ్ల లోపు వారే ఎక్కువగా బలవుతున్నారు.

18-45 ఏళ్ల మధ్యనున్న వయసున్న వారికి తాజాగా కేంద్రం టీకాలు వేయడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు కోవిన్ పోర్టల్ ను, ఆరోగ్యసేతు యాప్ లోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. అలా చేసుకున్న వారికే మొదట వేస్తామని పేర్కొంది.

దీంతో బుధవారం సాయంత్రం ప్రారంభమైన ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు దేశవ్యాప్తంగా యువత ఎగబడ్డారు. దీంతో సర్వర్లపై పెను భారం పడి అన్ని క్రాష్ అయ్యాయి.

అధికారులు, ప్రభుత్వం ఇంత డిమాండ్ వస్తుందని తెలియక ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో అంతా గందరగోళం నెలకొంది. చాలా మంది సెల్ ఫోన్లకు ఓటీపీలు రాక గందరగోళం నెలకొంది. రిజిస్ట్రేషన్లు కాలేదు. దీంతో అధికారులు దానిపై కసరత్తు చేస్తున్నారు. లక్షల మంది వెబ్ సైట్ లో నమోదుకు ఒకేసారి ట్రై చేయడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది.