Homeజాతీయ వార్తలుCockroach Janata Party Protest: కాక్రోచ్ చీఫ్ ను బొద్దింకను కొట్టినట్టు కొట్టారు.. వైరల్ వీడియో

Cockroach Janata Party Protest: కాక్రోచ్ చీఫ్ ను బొద్దింకను కొట్టినట్టు కొట్టారు.. వైరల్ వీడియో

Cockroach Janata Party Protest: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి కి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఆ తర్వాత హైదరాబాదులో ఆదివారం నిరసనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమవారం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు.

కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు పిలుపునిస్తుండగా.. వామపక్ష.. చీపురు పార్టీ సానుభూతిపరులు మాత్రమే హాజరవుతున్నారు. కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఈ నిరసనలకు హాజరవుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే జమ్ము కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలని.. డిమాండ్ చేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ జెన్ జెడ్ ఉద్యమం అన్నట్టుగా చెబుతున్నప్పటికీ.. అక్కడి కేవలం ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే హాజరవుతున్నారు.

కేంద్రంపై చేస్తున్న విమర్శలలో కాక్రోచ్ జనతా పార్టీ అతి శృతిమించుతోంది. కొంతమంది ఈ ముసుగులో కేంద్రం మీద ఉన్న ఆగ్రహాన్ని మొత్తం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలని.. డిమాండ్ చేస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసనలు సాగాల్సి ఉండగా.. అవి వేరే మార్గం సంతరించుకుంటున్నాయి. రాజకీయ నిరుద్యోగులు ఈ నిరసనలు పాల్గొని వారి పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రొఫెసర్ నాగేశ్వర్.. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి వంటి వారు ప్రసంగించారు.. వీరు మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి.

కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్ నగరంలో నిరసన చేస్తుండగా.. కొంతమంది అక్కడికి వచ్చారు. పాత చెప్పులతో అతని మీద దాడి చేశారు. మన ఇంట్లో దాగి ఉన్న బొద్దింకలను ఎలా అయితే కొడతామో.. అలానే కొట్టారు. పైగా చీడ పురుగు నువ్వు.. ఈ దేశానికి ఎందుకు వచ్చావురా.. అమెరికాలో ఉండి.. ఈ దేశానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నావ్ రా అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి అందరిని చెదరగొట్టారు.. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular