బాబు.. ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇక రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా..? ప్రజలు ఆయనను పదే పదే వద్దంటున్నారా..? ఎన్నికలేవైనా ఇక బాబుకు మాత్రం ఓటెయ్యమని తెగేసీ చెబుతున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచి నిన్నటి మున్సిపల్ ఎన్నికల వరకు ‘బాబూ’ఇక నువ్వు వద్దు బాబోయ్..’ అంటూ ప్రజలు తమ ఓటు ద్వారా తేటతెల్లం చేసినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల నుంచి పట్టణాల్లో జరిగిన పోలింగ్ లో బాబును ఎక్కడా ఆదరించకపోవడం […]

Written By: NARESH, Updated On : March 15, 2021 11:14 am
Follow us on

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇక రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా..? ప్రజలు ఆయనను పదే పదే వద్దంటున్నారా..? ఎన్నికలేవైనా ఇక బాబుకు మాత్రం ఓటెయ్యమని తెగేసీ చెబుతున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచి నిన్నటి మున్సిపల్ ఎన్నికల వరకు ‘బాబూ’ఇక నువ్వు వద్దు బాబోయ్..’ అంటూ ప్రజలు తమ ఓటు ద్వారా తేటతెల్లం చేసినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల నుంచి పట్టణాల్లో జరిగిన పోలింగ్ లో బాబును ఎక్కడా ఆదరించకపోవడం గమనార్హం. దీంతో ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా..? లేక టీడీపీనే మూసివేస్తారా..? అన్న చర్చ సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబు మొదటిసారిగా 1978లో చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత ఎన్టీఆర్ కుమార్తెను వివాహం చేసుకొని టీడీపీలో చేరారు. ఎన్టీఆర్ మరణించిన తరువాత ఆ పార్టీ పగ్గాలు చేపట్టి ఏక ఛత్రాధిపత్యంతో అప్పటి నుంచి అన్ని తానే అయి నడిపిస్తున్నారు. దాదాపు 13 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు ఎన్టీఆర్ కుమారులకు కూడా పార్టీ పగ్గాలు ఇవ్వకపోవడం చర్చనీయాంశం. అయితే జయాలు, అపజయాల మధ్య పార్టీని నడిపిస్తున్న బాబు ఇక పార్టీ నడిపించడానికి సమయం తీరిందా..? అన్న చర్చ సాగుతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు ఎన్నోరకాల హామీలు ఇచ్చాడు. అయితే కొన్నింటిని నెరవేర్చినా పోలవరం లాంటి ప్రాజెక్టులనుపెండింగ్ లో పెట్టారు. తన హయాంలోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన బాబు ఆ విషయంలో నాన్చుడు ధోరణి వ్యవహరించారు. ఇదే కాకుండా మరికొన్ని విషయాల్లో బాబుపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. దీంతో 2019లో చంద్రబాబుకు కనీసం అధికారం రాకుండా ఓడగొట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ 151 సీట్లతో అధికారం చేపట్టింది.

అయితే రెండేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ, ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారంటూ బాబు ప్రచారం చేశారు. దీనినే పంచాయతీ ఎన్నికల్లో వాడారు. అయితే పంచాయతీలో పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొననందున ఎన్నికల్లో అక్రమాలు చేశారని అన్నారు. కాగా పట్టణాల్లోనూ ఇదే సీన్ రిపీట్ కావడంతో చంద్రబాబు ఇక ఏం చెప్పాలో అర్థం కాకుండా మారింది. ఏపీ ప్రజలు ఇక బాబును దరి చేరనిచ్చే పరిస్థితి లేదని అర్థమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో బాబు పార్టీ అధినేతగా తప్పుకుంటే బెటరని, ఎన్టీఆర్ లాంటి యంగ్ టైగర్లను దించాలని ఆ మధ్య సొంత నియోజకవర్గంలోని కుప్పంలోనే నినాదాలు వినిపించాయి. అంతేకాకుండా బాబు మైండ్ సెట్ పాతదని, ఇప్పుడన్నీ రాజకీయాలు మారాయని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి..